Wednesday, May 11, 2016

యూరప్ డైరీ - ౧

ఈ సీరీస్ కి యూరప్ డైరీ అనిపెట్టాల లేక మధ్య ఐరోపా యాత్రలు అని పేరు ఉంచాలా లేక బెర్లిన్ లోఎక్కువ రోజులున్నాను కాబట్టీ బెర్లిన్ డైరీ అ వ్రాయాలా అన్న సంశయంలో ఉన్నాను. అది ఎలాంటి సంశయం అంటే, మళ్ళీ యూరప్ యాత్ర చేసి తిరిగి వచ్చి ఇది వ్రాసేంత.
వృత్తికి సంబంధించిన పని మీద గానీ, ప్రవృత్తి వలన కలిగిన పరవశంలో గానీ యూరప్ కి సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళక తప్పదు అన్న విషయం నాకర్ధమైంది. అందువలన యూరప్ లో ఉండే ఆ నాలుగైదు రోజుల గురించీ మన బ్లాగ్మిత్రులకి తెలియచేద్దామన్న చిన్న ఆశతో ఈ టపాల వెల్లువ మొదలెట్టాను.

ఈ బ్లాగు టపా వ్రాస్తున్న సమయానికి నేను యూరప్ లోని ఐదు నగరాలను రెండు దఫాలుగా పర్యటించి వచ్చాను.
రెండు సార్లూ బెర్లిన్ లో జరిగే వృత్తిపరమైన కాన్ఫరెన్స్ కోసం వెళ్ళినా సమీప భవిష్యత్తులో సొంత ఖర్చులతో యూరప్ వెళ్ళి ఒక వారం ఉండేలా ఈ యాత్రలు నన్ను ప్రేరేపించాయి.
అక్కడి జనం, సంస్కృతి, దినచర్య తీరుతెన్నులు నన్ను బాగా ఆకర్షించాయి. మరి నేను ఇతర దేశాలు వెళ్ళి చూడలేదు. అమెరికా, జపాను, సింగపురం లలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చునుగాక, కానీ ప్రస్తుతానికి నాకు ఐరోపా బాగా నచ్చేసింది. ఎంత అంటే ఈ జీవితాంతం ఐరోపా లోని వివిధ ప్రాంతాలను అర్ధం చేసుకుంటూ బ్రతికెయ్యాలనే ఆలోచనలు వచ్చేంత. వియెన్నాలోని ఒక మ్యూజియంలో ఒక చిన్న గదిలో ఉంచిన పెయింటంగులను చూస్తూ సంవత్సర కాలం గడిపెయ్యొచ్చేమో అన్నంత పరవశం కలిగించాయి అక్కడి చిత్రకళలు, వాటిని కాపాడుతూ కూడా అందరికీ ప్రదర్శించే తీరు.
డైరీ మొదటి పేజీ కనుక. అందరూ చదివేలా వ్రాస్తున్న డైరీ పేజీలు కనుక. నెలలు-సంవత్సరాలు వ్యత్యాసంతో వ్రాస్తున్న అంశాలు గనుక.
ఇందులో అన్ని నిష్పూచీలే ఉంటాయి. వ్యక్తిగత విషయాలు ఉండవు, ఉన్నా కాకతాళీయం అనేసుకోండి. దినచర్యలా కాకుండా నన్ను అత్యంత ప్రభావితం చేసిన కొద్ది విషయాలే పంచుకోబోతున్నాను.
మిగితా విషయాలు రెండో పేజీలో...

Tuesday, October 13, 2015

బలహీన క్షణం

నా పేరు బలహీన క్షణం. నేను సమయ కొలమానాల్లో కనిపెట్టబడిన వేల కొలతల్లో ఒకడ్ని. నా నిడివి పేరులో ఉన్నట్టే ఒక క్షణ కాలం. నేను సర్వవ్యాపిని. యముడొక్కడే సమవర్తి అనుకొంటారు మీలో చాలా మంది. కానీ పెక్కు వ్యాసులు ఉన్నది ఎంత నిజమో పెక్కు సమవర్తులు ఉన్నదీ అంతే నిజము. 
ఉదాహరణకి నిద్ర సమవర్తి, పేదా-పెద్ద అన్న తేడా లెకుండా అందరూ నిద్రపోవాల్సిందే, అలానే చావు, అలానే సంతోషము కూడా. 
నా నిడివి ఒక్క క్షణమైనా, మనుషులు వాళ్ళ అవకాశాన్ని బట్టి నా నిడివిని నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు. సంవత్సరాలు దాటేయిస్తారు. 
వారి జీవితాల్లో ఏం తప్పు జరిగినా నా మీదకు నెట్టేస్తారు జనాలు. 
తన భర్తను అనాల్సిన మాటలు అనేస్తుంది భార్య, ఏమయిందని మళ్ళీ ఆలోచించుకొని అదొక బలహీన క్షణం అని తను చేసిన తప్పుకు నన్ను నిందితుడ్ని చేసేస్తుంది. 
పెద్ద పెద్ద దేశాధినేతలు కూడా ఎన్నో తప్పులు చేసేస్తారు, వేల జనాల ప్రాణాలు బలి తీసుకుని ఆ నింద కూడా నా మీదకు నెట్టేస్తారు. 
నేనే ఆ దుశ్చర్యకు కారణమని కాబోలు. 

Tuesday, May 26, 2015

నిర్గమము

నేను నా గుఱ్ఱాన్ని కొట్టం నుండి తెమ్మని బంట్రోతుకు పురమాయించాను.
వాడికి నా మాటలర్ధం కాలేదు.
అందుకని నేనే కొట్టానికి వెళ్ళి గుఱ్ఱానికి కళ్ళెం కట్టి జీని వేసి సిద్ధం చేసాను.
గుఱ్ఱం పైకెక్కి స్వారీకి సిద్ధంగా కూర్చున్నాను.
దూరంగా బూరూదిన శబ్దం వినిపిస్తోంది.
బంట్రోతును అడిగాను ఆ శబ్దం ఎందుకు అనీ.
వాడికేమి తెలీదట వాడేమీ వినలేదుట.
గుఱ్ఱాన్ని పరిగెత్తిస్తూ వెళుతున్న నన్ను గుమ్మం దగ్గర ఆపి అడిగాడు - "అయ్యగారు ఎక్కడికి వెళుతున్నారు?"
"నాకు తెలీదు." అని నేనన్నాను "ఇక్కడి నుండి బయటకి, ఇక్కడి నుండి వెలుపలకి. బయటకి, ఇంకెక్కడికీ లేదు, నా లక్ష్యాన్ని చేరేందుకు అదొక్కటే మార్గం."
"అయితే మీ లక్ష్యం మీకు తెలుసనమాట." అన్నాడు వాడు.
"ఊఁ!" అన్నాన్నేను, "ఇప్పుడేగా చెప్పాను. ఇక్కడి నుండి బయటకి -- అదే నా లక్ష్యం."

Wednesday, November 19, 2014

స్వాతంత్ర్యవీరుడు

ఉయ్యాలవాడ నరసరామయ్య అనే ఉయ్యలవాడ వాస్తవ్యుడు స్వాతంత్ర్యవీరుడు అనే పేరుతో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రను పద్యకావ్యముగా వ్రాసారు. 1973 ముదితం.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం గురించి ఏమయినా పుస్తకాలు దొరుకుతాయా అని గత ఎనిమిదేళ్ళుగా ప్రయత్నిస్తున్న నాకు మొదట బెంగుళూరు కెంగెరిలో ఉండే తంగిరాల సుబ్బారావు గారి రేనాటి సూర్యచంద్రులు అన్న పుస్తకం తారసపడింది. అందులో పైన చెప్పిన పుస్తకం గురించి ప్రస్తావన ఉన్నా, ఆ పుస్తకం నాకు దొరకలేదు.
ఇన్నాళ్ళకి నిన్న విజయవాడ ప్రాచీనాంధ్రగ్రంధమాల లో ఈ చిన్ని పొత్తము నా చేతికందింది. ఇందులో ఉయ్యాలవాడ వారి చిత్రం కూడా ఉంది.
 

Thursday, September 18, 2014

நீ தானே எந்தன் பொன்வசந்தம்...

நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்

நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்

ஆஹா...நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
என் வாசல் ஹே வரவேற்கும் அன்னேரம்
உன் சொர்க்கம் ஹே அரங்கேரும் கண்ணோரம்

நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
---
பாதை முழுதும் கோடி மலர்கள்
பாடி வருமே தேவக் குயில்கள்
உன் ஆசை ஹே மிதக்கின்ற பாலாடை
உன் காலை ஹே குளிப்பாட்டும் நீரோடை
வெயில் நாளும் சுடுமென தேகம் கெடுமென ஜன்னல்
திரையிடும் மேகம்
இரு காதல் விழிகளில் பேசும் மொழிகளில் பிறையும்
பௌர்னமி ஆகும்
சந்தோஷம் உன்னோடு கைவீசும் என்னாலும்
---
நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
என் வாசல் ஹே வரவேற்கும் அன்னேரம்
உன் சொர்க்கம் ஹே அரங்கேரும் கண்ணோரம்
---
ஈர இரவில் நூறு கனவு
பேதை விழியில் கோடி நினைவு
பன்னீரில் ஹே இளந்தேகம் நீராடும்
பனிப்பூக்கள் ஹே உனைக்கண்டு தேனூரும்
நீ ஆடை அணிகலன் சூடும் அறையில் ரோஜா மல்லிகை
வாசம்
முக வேர்வைத் துளியது போகும் வரையினில் தென்றல்
கவரிகள் வீசும்
நெஞ்சோரம் தவழும் முத்தாரம் என்னாளும்
---
நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
என் வாசல் ஹே வரவேற்கும் அன்னேரம்
உன் சொர்க்கம் ஹே அரங்கேரும் கண்ணோரம்