Thursday, August 16, 2012

మధుసూదన మధుసూదన హర మామక దురితం


శరణం భవ కరుణాం మయి
కురుదీనదయాళో
కరుణారస వరుణాలయ
కరిరాజ కృపాళో

అధునాఖలు విధినా మయి
సుధియాసుర భరితం
మధుసూదన మధుసూదన హర
మామక దురితం

వరనూపుర ధరసుందర  కరశోభితవలయా
సురభూసుర భయవారక
ధరణీధర  కృపయా
త్వరయా హర భయమీశ్వర
సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన
హర మామక దురితం

ఘృణిమండల మణికుండల
ఫణిమండల  శయన
అణిమాది సుగుణ భూషణ
మణిమంటప సదన
వినతాసుత ఘనవాహన
మునిమానసభవనా
మధుసూదన మధుసూదన
హర మామక దురితం

అరిభీకర  హలిసోదర
పరిపూర్ణ సుఖాబ్దే
నరకాంతక నరపాలక
పరిపాలిత జలధే
హరిసేవక శివ నారా
యణ తీర్థ పరాత్మన్

మధుసూదన మధుసూదన
హర మామక దురితం






మకరచెఱలో  చిక్కుకుని విలవిలలాడుతున్న కరిరాజుని కాపాడిన ఓ అత్యంత దయామయుడవయిన దేవదేవా, కరుణామయా, నాపై నీ కరుణను కురిపించు.
మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
కాళ్ళకు మనోహరమయిన గజ్జెలు కట్టి చేతులకు అందమయిన కంకణాలు కట్టుకుని , సమస్త దేవత్లూ మరియు ఋషిజనాల కష్టాలు తీర్చు స్వామీ, మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
మణులు ఖచితమయిన చెవిపోగులు ధరించి, ఫణి రాజు పై శయనించిన ఓ స్వామీ , నీవు సమస్త సుగుణాలూ కల వాడవు, ఆ గరుత్మంతుడ్ని వాహనం గా చేసుకుని ఉన్నవాడవు. మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
నీ శత్రువులకు నీవు అరివీర భయంకరుడవు, సుఖ సంతోషాల సముద్రం నీవు, నరకుడిని సంహరించి, అందరినీ కాపాడావు, నారాయణ తీర్థుల సేవలు గొన్న దేవా, మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.