Wednesday, September 15, 2010

ఆనంద్ -- మంచి కాఫీ లాంటి సినిమా

ఇప్పటికే అర్థమైపోయుంటుంది, నా తదుపరి టపా, నా ఇష్టమైన సినిమా ఆనంద్ గురించి.....
మొదట నేను కొన్ని బ్లాగ్లను జల్లెడ పట్టాను, ఎవరైనా ఆనంద్ గురించి రాసారా అని, అక్కడ నాకు ఏ బ్లాగులోనూ పూర్తి స్థాయి సమీక్ష దొరక్క నేనే రాద్దాం అని మొదలెట్టాను.

ఆనంద్, ఒక మంచి కాఫీ లాంటి సినిమా
ఈ చిత్రం పై ఒక టపా సరిపోదు, మన జీవితం లో జరిగే ప్రతి సంఘటనతోనూ నాకు ఈ సినిమాలో ఏదో ఒక సీన్ తో సారూప్యత కనిపిస్తుంది.
హైదరాబాద్ లో ని లైఫ్ స్టైల్ ని ఈ సినిమాలో చక్కగా చూపించారు కమ్ములగారు.
పద్మారావ్ నగర్ లోని ఒక ఇల్లు, ఆ ఇంటి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఒక ఎత్తైతే
కథానాయికను సంగీతాధ్యాపకురాలిగా చూపడం మరో హైలైట్
అసలు అందరూ శాస్త్రీయ సంగీతాన్ని మర్చిపోతుండగా ఈ సినిమా మళ్ళీ ఒక్క సారి అందరినీ మురిపించింది
పొద్దున్నే భావయామి, ఇంతకన్నా
Get this widget | Track details | eSnips Social DNA


ఇత్యాది పాటలతో రోజుని ఆరంభించాలి అని చెప్పకనే చెప్పారు
ఇక కాఫీ తెలుగు వారికే బ్రాండ్ పానీయం, ఇంటికి ఎవరైనా ముందు రాంగానే (మా ఇంట్లో) అడిగే మాట - "కాఫీ తెమ్మంటారా?"
ఇక యౌవ్వనంలో ఎలా ఉండాలో - తమ బాధ్యతల్ని గుర్తించి వాటికి అనుగుణం గా నడుచుకోవటం - ఎలా నడుచుకోవాలో బాగా చూపించారు.
నర్సరీ కి వెళ్ళటం మొక్కల్ని పెంచుకోవటం ఇవి బై డీఫాల్ట్ ప్రతి హైదరాబాదీ లోను ఉండే క్వాలిటీస్


మొత్తం మీద చెప్పొచ్చేదేంటంటే ఈ సినిమాని దాదాపు ఒక ౩౦౦(మూడు వందల) సార్లు నేను చూసాను, అయినా విసుగు రాదు, ప్రతీ వీకెండ్ ఈ సినిమా చూడాల్సిందే!!!
ఇక పాటలైతే , నా ఐ పాడ్, నా స్నేహితుల ఐ పాడ్ లలో ఖచ్చితంగా ఉంటాయి.

9 comments:

  1. aanand naaku chalaa chalaa nachina cinema idi mee favourite kuda aindanduku naku anandanga vundi

    ReplyDelete
  2. నా మనసులో ఈ సినిమా ఫై వున్న ఫీలింగ్స్ ని xerox తీసినట్టు రాసేసారు.
    ఇది ఎప్పటికి నా fav సినిమా
    మీరు శేఖర్ మొదటి సినిమా డాలర్ డ్రీంస్ చూసారా.
    చూడక పొతే ఒకసారి చూడండి. ఆ సినిమా లో NRI ల గురించి, అమెరికా వెళ్ళాలి అని కలలు కనేవాళ్ళ గురించి బాగా చూపించాడు. ఆ సినిమాకి అయితే జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా వచ్చింది.

    ReplyDelete
  3. Too much of coffee(Anand) is injurious to health :)

    ReplyDelete
  4. ఎటొచ్చీ ఆ పాటలకి హీరోయిన్ లిప్ సింక్ ఇబ్బందిగా ఉంటుంది. ఆ అమ్మాయి బ్లాంక్ ఫేస్‌తో చాలా చిన్నగా పెదవులు కదుపుతూ ఉంటుంది.

    ReplyDelete
  5. ఆనంద్ ఒక మంచి సినిమా మాత్రమే . గొప్ప సినిమా ఏ మాత్రం కాదు , రొటీన్ లైఫ్ స్టయిల్ , మెసేజ్ లేని మూవీ . మంచి పాటలు కోసం మాత్రమే సినిమా . శాస్త్రీయ సంగీతం ఎక్కడ వాడుకోవలో తెలియని శేఖర్ , దేశ భక్తి పాటలను కూడా విషాదం లో ( లీడర్ సినిమా ) , బాక్ గ్రౌండ్ శాడ్ గా చూపించి అపవిత్రం చేస్తున్నాడు .

    ReplyDelete
  6. @Mahesh , చూసానండి కాకపోతే నా ఉద్దేశ్యంలో ఆ సినిమా ని హైదరాబాద్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పూర్తిగా అర్థం చేస్కోలేరు, హైదరాబాదీస్ వాడే భాష తెలుగు-హిందీ-ఆంగ్లం ల మిశ్రమం, అలాగే మన హైదరాబాద్ లోని కాస్మోపాలిటన్ విధానాల్ని చక్కగా ఆ చిత్రంలో చూపించారు. కానీ మిగతా జనాలకు ఆ సినిమా నచ్చక(అర్థం కాక) పోవచ్చు.
    @Anonymous : మీరెవరో గానీ మీ పేరు తో సహా కామెంట్ వేస్తే బావుంటుంది
    తెలుగు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు మా తెలుగుతల్లికి అన్న పాటను పెట్టారు,
    అది మీ దృక్కోణంలో అపవిత్రమా?

    ReplyDelete
  7. నిస్సందేహంగా ఆనంద్ సినిమా బాగుంది . మూస పాత్రల, కధల, తెలుగు సినిమాల నుంచి ఒక చిన్న రిలీఫ్. కానీ అదే గొప్ప సినిమా అనటం భావ్యం కాదు. శేఖర్ కమ్ముల మంచి కధకుడు దర్శకుడు కానీ అయన సినిమాల నాణ్యత రాను రాను తగ్గుతోంది. (తీసినవి కొన్నే ఆయినా) ముఖ్యం గా ఆయన కధల్లో మొదటినుంచి ఉన్న పట్టు చివర్లో తేలిపోతుంది ఒకో సారి "ఓస్ ఇంతేనా అనిపించే " పాత్రలు. కూడా మారాలి. కేవలం వైవిధ్యం మీదే అయన సినిమాలు ప్రజాదరణ పొండుతున్నై. సంగీతం అంటారా అది రాసిన వాళ్ళ మీదా కంపోసర్ మీద ఆధారపడి ఉంటుంది (ఆఫ్ కోర్సు దర్శకుడు కూడా ) ఏమైనా శేఖర్ కమ్ముల ఇంకా చాలా ఎదగాలి

    ReplyDelete
  8. u r great
    మీరు కాఫీ ప్రియులా
    మీకోసం శేఖర్ గారి - LIFE IS BEAUTIFUL (తెలుగులో ) ఒక చక్కని ---- లాంటి సినిమా రాబోతోంది . Classical , Patriotic tunes already availed and next which he likes to ..o.. .

    ReplyDelete
  9. చూసానండి
    నేను తరచూ సినీగోఅర్స్ వంటి సైట్లను తిరగేస్తున్నాను, ఈ మధ్యనే

    ReplyDelete