Friday, September 14, 2012

నీకేమయినా అభ్యంతరమా శివశక్తీ?

మంచి వీణను తయారు చేసావు - దానిని చెత్తకుప్పలోకి పడేస్తావా?
చెప్పు, శివశక్తీ!!! ఎందుకని నన్ను ఈ జ్ఞానంతో పుట్టించావు?

నాకు శక్తినిస్తావా - ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా జనం బ్రతకేలా నేను చెయ్యాలి!
చెప్పు, శివశక్తీ!!! వారు ఈ భూమికి భారమై బ్రతకాలా?

నేను చెప్పినట్టూ ఆడే బంతిలా, నా శరీరం నా బుద్ధి చెప్పినట్టూ ఎక్కడికయినా వెళ్ళిపోవాలి
కల్మషంలేని బుద్ధినివ్వు శివశక్తీ, జీవితానికే జీవితాన్నిచ్చే జీవితాన్ని ప్రసాదించు శివశక్తీ!!!

ఈ శరీరం కాలి బూడిదయ్యాక కూడా నీ పాటలే నేను పాడాలి, అలాంటి నన్ను నాకివ్వు శివశక్తీ
అచంచలమయిన ఆత్మవిశ్వాసాన్నే కదా నేనడిగింది, నాకివన్నీ ఇవ్వటానికి నీకేమయినా అభ్యంతరమా శివశక్తీ?

మనస్సు నిలకడగా ఉండాలి

మనస్సు నిలకడగా ఉండాలి
మాట తీయగా ఉండాలి
మంచి ఆలోచనలు ఉండు గాక
అనుకున్నవి జరగుగాక
సులువుగా ఆశయాలు నెరవేరు గాక
ధనమూ, ప్రేమా కావాలి
ధరణిలో మంచి పేరు సంపాదించాలి

కన్నులు తెరిచి ఉండుగాక
పనిలో శ్రద్ధ ఉండుగాక
స్త్రీలు స్వతంత్రంగా ఉండు గాక
పరాత్పరుడు అందరినీ రక్షించుగాక
భూమి సస్యశ్యామలియయి ఉండుగాక
స్వర్గాలు చేరువలో ఉండుగాక
సత్యమే నిలుచుగాక
ఓం ఓం ఓం

మూలం : సుబ్రహ్మణ్య భారతి రచన

மனத்தில் உறுதி வேண்டும்

மனதி லிறுதி வேண்டும் 

வாக்கினி லேயினிமை வேண்டும்
நினைவு நல்லது வேண்டும் 

நெருங்கின பொருள் கைப்பட வேண்டும்
கனவு மெய்ப்பட வேண்டும், 

கைவசமாவது விரைவில் வேண்டும்,
தனமும் இன்பமும் வேண்டும், 

தரணியிலே பெருமை வேண்டும்,
கண் திறந்திட வேண்டும், 

காரியத்தி லுறுதி வேண்டும்,
பெண் விடுதலை வேண்டும், 

பெரிய கடவுள் காக்க வேண்டும்
மண் பயனுற வேண்டும், 

வானகமிங்கு தென்பட வேண்டும்,
உண்மை நின்றிட வேண்டும், 

ஓம் ஓம் ஓம்.

Thursday, September 13, 2012

అమ్మాయీ!

అమ్మాయీ,
నీ కనులు చంద్రుళ్ళోని కళనూ, సూర్యుని తేజాన్ని కలిగి ఉన్నాయి!

నల్లని గుండ్రనికనులు - రేయాకాశపు నల్లనితనాన్ని లాక్కున్నవా?
మెరిసే వజ్రాలు పొదిగిన సరికొత్త నల్లపట్టుచీర కట్టావు - నడిరేయి ఆకాశాన గల తారల్లా.
అప్పుడే పూచిన పూల సుమగంధపు నవ్వు నీది
నీలసంద్రపు అలలు నీ హృదయ ప్రేమ తరంగాలు
నీ గళం - తీయని కోకిల గళం
అమ్మాయీ
నేను నీ ప్రేమలో పడ్డాను
ఏవో కట్టుబాట్లూ, నియమాలూ అంటున్నావు
అమ్మాయీ
అవి ఎందు కోసం?
కోపావేశాల్లో మరిగిపోయే వారికే కదా ఆ కట్టుబాట్లూ, ఓ అమ్మాయీ!
పెద్దల అంగీకారంతో పెళ్ళీ క్రతువులు ఆనకి చేసుకొనవచ్చు
నేను వేచి ఉన్నాను, చూడూ
ఓ ముద్దుకై.
ఓ అమ్మాయి!

Saturday, September 8, 2012

విండోస్ ఎక్స్పీ లో ఇన్‍స్క్రిప్టు స్థాపించడం

విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి ఈ క్రింది సోపానాలను పాటించండి.

సోపానం 1 :
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి


సోపానం 2:
ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.


సోపానం 3:
ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. ఇప్పుడు మీ మిషను reboot చేసి, మరలా మొదటి రెండు సోపానములను పాటించి, Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లండి. ఇక్కడ Text Services and input languages లోని details నొక్కండి.


సోపానం 4:క్రింది బొమ్మలో చూపిన విధంగా Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి.


సోపానం 5:
Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.


సోపానం 6:
ఇప్పుడు Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Preferences విభాగంలోని Language Bar ని నొక్కండి.


సోపానం 7:Language Bar Settings లో Show the Language bar on the desktop ని ఎంచుకోండి.


సోపానం 8:
ఇప్పుడు మీ డెస్కుటాపు మీద ఈ క్రింద చూపినట్లుగా Language Bar కనిపిస్తుంది. దీనిలో తర్వాతి బొమ్మలో చూపిన విధంగా Teluguను ఎంచుకుని మీకు కావలసిన చోట తెలుగులో టైపు చేసుకోండి. కీబోర్డు లేయవుట్ చివరి బొమ్మలో చూపబడినది.కీబోర్డు లేయవుట్

Friday, September 7, 2012

యేది యేది కుదురేది యేది యెదలో పాట సాహిత్యం

యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక 
పెదవే పేరై నీదై ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో ఓఓఓ
యేది యేది అదుపేది యేది మదిలో ఓఓఓ ఓఓఓ

నే ఓడే ఆట నీ వాటం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశా
నీ ఆశే నాకూ శ్వాస
ఊహా ఊసూ నీతో నేనుంటే శా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో ఓఓ
యేది యేది అదుపేది యేది మదిలో ఓఓ

నా కాలం నీదే, నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్ళవుతున్నా
ఓహో నీ పాఠం నేనే, నన్నే చదివేసెయ్ అర్ధం కాకుండా 
నాలోకం నిండా నీ నవ్వే, నాలోనూ నిండా నువ్వే
తీరం దారీ దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదయితే, నువ్వంతా నేనయితే
మనలో, నువ్వు-నేను ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక 
పెదవే పేరై నీదై ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో