ఇవాళ పొద్దున పాల వాడి దగ్గర ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.
మాకు ఇక్కడ కోరమంగలలో పాలూ, పళ్ళూ, కూరగాయలు అన్నీ ఒక కొట్టులోనే ఉంటాయి. నేను పాలు కొనేసి తిరిగి వస్తుంటే, పరిచయమున్న ఒక గొంతు వినిపించింది - అరటి పళ్ళ కోసం బేరమాడుతున్నాడో పెద్ద మనిషి, కొంచెం ముఖం చూసి ఏమీ గుర్తు రాకపోయే సరికి, ఎవరో ర్యాండం మనిషి అని అనుకుని రూం కి వచ్చేసాను.
కానీ రూంకి వచ్చి కాఫీ పెట్టుకుంటుంటే గుర్తొచ్చింది ఆ వాయిస్ ఎవరిదో. చాలా పరిచయమున్న వాయిస్. మూడో తరగతి నుండి, తొమ్మిదో తరగతి వరకూ రోజూ మార్నింగ్ అసెంబ్లీలో వింటూ వచ్చిన వాయిసాయే!
నేను తొమ్మిదో తరగతిలో ఉండగా కాసర్గోడ్ కి ట్రాన్స్ఫర్ మీద బదిలీ అయి వెళ్ళారు. ఈ మధ్య బెంగుళూరు వచ్చిన కొత్తలో వాళ్ళబ్బాయిని కలిసాను, నాకన్నా ఒక సంవత్సరం సీనియర్ ఇతను. స్కూల్ లో ఏ క్విజ్ పోటీ జరిగినా, రూపకం జరిగినా నేనూ, ఈ అభిజిత్ భయ్యా, ఇంకా తేజశ్విని దీదీ అని (ఈమె ఎనిమిదో తరగతిలో ఉండగా వీళ్ళ నాన్నకు మాస్కో ట్రాన్స్ఫర్ అయింది, ఈమె కూడా ఇప్పుడు బెంగుళూరులోనే!) మేం ముగ్గురం టీం అప్ అయితే ప్రత్యర్ధులుండే వారు కాదు. గుర్తొచ్చి అభిజిత్ భయ్యాకి కాల్ చేసాను, అవును సార్ ఇప్పుడు సిలిగురిలో ఉంటున్నారు నన్ను చూద్దామని వచ్చారు అన్నడు.
అయ్యో, ఆయనను ప్రత్యక్షంగా గుర్తించల్క పోయానే అని దిగులు పడి, తిరిగి ఎప్పుడు కలవవచ్చో కనుక్కున్నాను, వచ్చే వారం ఖాళీ అన్నారు. ఆయన్ని కలిసొచ్చాక ఆ విశేషాలతో ఇంకొక పోస్టు!
No comments:
Post a Comment