Wednesday, September 29, 2010

సంగీత ప్రియులకోసం......

ఈ టపా చదివిన పిదప ఒక మారు ఈ వెబ్సైటును చూడండి , మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళతారు 
మన దక్షిణ భారతాన్ని మొత్తాన్ని ఒక తాటిపై నిలిపింది సంగీతమనే చెప్పాలి.
మనం అధ్యయనం చేసెడి సంగీతం - దీనినే కొందరు దక్షిణ భారత సంగీతం అని, మరికొందరు కర్ణాటక సంగీతమని అంటారు.
కన్నడ రాజుల ద్వారా పోషించబడింది కాబట్టీ ఆ పేరు వచ్చి ఉండవచ్చు అని నేననుకుంటున్నాను, నేనైతే ఎప్పటికీ కర్ణాటక సంగీతం అని మాత్రం పలుకాలంటే ఒక రకంగా ఉప్పుపలుకులు నములుతాను(ఆ భావన వల్లనే). శాస్త్రీయ సంగీతమనో, మరీ అనవలసి వస్తే కార్నాటిక్ (carnatic not karanatik) అని దాటవేస్తాను.
ఇందులో ఉన్న ప్రత్యేకలేమిటంటే, ఈ శాస్త్రమునకు ప్రధాన వాగ్గేయకారులంతా మన తెలుగువారే, పాడేవారు(ఒకప్పుడు రాజుల కొలువుల్లో-ఇప్పుడు కాదు) కూడా మనవారే ఉండేవారేమో కానీ ఈ మధ్య పాశ్చాత్యుల ప్రభావంతో మొదట పాప్, ఆ పై హిప్-హాప్, ఇప్పుడు రాక్, మెటల్ ఇంకెక్కడికో ఈ పయనం????

అయితే మన దక్షిణ భారత సంగీతకళ చాలా ప్రాచీనమైనది, ప్రపంచంలోనే!!!
ఇది చాలా జటిలమైనందువల్ల సాంకేతికంగా,కళాపరంగా కూడా చాలా నేర్పరితనం కావాలి. మన ఈ కళకు మూలం రాగం, మరియు తాళం.
రాగం అనేది స్వరముల గంభీరత్వాన్ని కొలుస్తే, తాళం అనునది వాటి రూపాంతరములను కొలుస్తుంది.
మనకి ఏడు తాళాలు మరియు డెబ్బదిరెండు మూలమైన రాగములు కలవు.
మిగితా రాగాలన్నీ వీటిపై ఆధారపడి ఉంటాయి లేదా వీటి నుండి ఉద్భవించబడ్డాయి. ఈ ౭౨ రాగాలను మేళకర్తరాగములంటారు.
౧౯ వ శతాబ్దానికి చెందిన త్యాగబ్రహ్మ(త్యాగరాజులవారు), ముత్తుస్వామి దీక్షితులవారు మరియు శ్యామశాస్త్రి గారు, కొన్ని వేల కృతులను అందించిన మహా వాగ్గేయకారులు.
మన ఈ సంగీత శాస్త్రం ముఖ్యంగా భక్తిరసప్రధానముగా ఉంది.
మనం సరిగమలు అని వాడుక భాషలో చెప్పే స్వరాలే ఈ సంగీతశాస్త్రానికి పునాది.
అన్ని రాగములు ఈ సప్తస్వరముల నుండే ఉద్భవించాయి.
ఈ సరిగమలకు గల పూర్తి నామాలు.
  • స - షడ్జమం
  • రి - రిషభం
  • గ - గంధర్వం
  • మ - మధ్యమం
  • ప - పంచమం
  • ద - దైవతం
  • ని - నిషాదం
ప్రతి  స్వరమునకు మూడు విధములు గలవు, ఇది షడ్జమమునకు మరియు పంచమమునకు వర్తించదు.
అలాగే మధ్యమమునకు కూడా రెండే విధములు కలవు.
ఒక  పక్క సౌందర్యమును మరో పక్క భక్తిని చక్కగా మేళవిస్తే తయరైన కృతులు అత్యంత మధురంగా ఉంటాయి.
భగవంతుని  సాక్షాత్కారమే ధ్యేయంగా రచింపబడిన ఈ సంగీతం ఎంతో సుందరంగా ఉంటుంది.
భగవంతుడికి, భక్తికి, భక్తునకు, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. శివుడ్ని నాదం యొక్క ప్రతిరూపంగా
కొలుస్తాము. ఎందరో దేవతల వద్ద సంగీత వాద్యాలు ఉండటం కూడా గమనించాము.
కృష్ణుడు కూడా వేదానాం సామవేదోస్మి అన్నాడు కదా! (సామవేదం సంగీత-శృతి-గాన ముఖ్యం)
పార్వతి లాస్యానికి ప్రతిరూపం. ఎల్లప్పుడూ జ్ఞానదేవత అయిన సరస్వతిని వీణాధారిణిగానే చూస్తాం. అసలు వీణలేనిదే ఆమెను సరస్వతి అని కూడా పోల్చుకోలేము. వీణను విపంచి అని కూడా అంటారండోయ్.
లక్ష్మీ దేవి సంగీతప్రియ. శ్రీమహావిష్ణువు ఎక్కడ పడితే అక్కడ డోలు వాయించేస్తాడు.
నంది లయకు అధిష్టాన దైవం. ఇహ నారద-తుంబురులు సంగీతలోకంలో ప్రఖ్యాతులు. వారిని వైనిక-గాయకులుగా మనం గుర్తించాలి.
మొన్నామధ్య  ఎస్వీ గారి సినిమాలో కూడా ఘటోత్కచుడ్ని వీణాపాణిగా చూపారు.
ఇక గంధర్వులు, కిన్నరులు, కింపురుషులైతే ఈ విద్యకు పెట్టింది పేరు.
మన ధర్మశాస్త్రాల్లో ఈ విద్యను గంధర్వవిద్యగా చెప్పారు.
మారుతి అయిన ఆంజనేయ స్వామి హనుమద్వీణ వాయించడంలో దిట్ట. ఈనాటి చిత్ర వీణ ఈ హనుమద్వీణకు రూపాంతరం.

ఇంతటి విశిష్టత కలిగిన మన సంగీతాన్ని మనం అర్థంకాలేదనో
నాకు వంటపట్టదనో వదిలెయ్యవచ్చా!!!
పాశ్చాత్య పోకడలకు పోయి మన అరుదైన ఈ సంపదను వదులుకోగలమా.
ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల మన దైన ఈ విద్యను అరవలు తమ కాపీరైట్లు పెట్టుకోవటం మొదలెట్టారు.
ఇది ఏమి బీసీ కాలం నాటిది కూడా కాదే
అన్నమయ్య , రామదాసుల వారికాలానిది కూడా కాదు.
నన్నడిగితే నాకు తెలిసినంత వరకూ భారతీయుడిగా మనం నేర్చే అత్యంత మోడర్న్ విద్య ఈ శాస్త్రీయ సంగీతం.
ఇందులోని మెళకువలు , ఛలక్కులు, జుగల్బందీలు, ఏ హిప్-హాప్ కు మెటల్ కు తీసిపోవు.
అనుభవించడం మొదలెట్టాక రొజుకో వింత అనుభూతి కలుగుతుంది.

అయితే ఏమిటి అంటారా....
ఇదంతా పెద్ద ఖర్చుతో పని అంటారా.
మీరు నేర్చుకోకపోయినా వినండి వినిపించండి, నక్కాబోయే భార్య "గిమ్మీ మై తాళి మై లైఫ్ ఇజ్ ఖాళీ ఖాళీ" అని
పాడేకన్న అరకొరగా ఏ త్యాగబ్రహ్మ కృతే పాడినా నేనెంతో ఆనందిస్తాను.
అలా అందరం మొండిపట్టు పట్టామంటే మన నుంచి తరలిపోతున్న వోక్స్వాగన్, డెల్, తిరిగిరాకపోయిన సంగీత ప్రియులం మనమే నన్న ట్రేడ్ మార్కు మనకు మిగిలిపోతుంది.
ఎంతో కష్టపడి రాత్రీ పగలూ ఒకటి చేసి మనకు సంపాదించారు మన త్యాగబ్రహ్మ ఈ పేరుని
దీన్ని అప్పణంగా అరవలకు వదిలివేయాలా?
ఆలోచించండి.....

ఈ వెబ్సైట్ ఖచ్చితం గా చూసి అక్కడ ఉన్న పాటలను డౌన్లోడ్ చేసి వినండి.
అదొక అలవాటు గా మార్చు కోండి.
కనీసం రోజుకొకటి వినండి. ఉచితంగా మీకు పాటలు వస్తున్నా మీరొద్దంటే మిమ్మల్ని ఎవ్వరం మార్చలేం. మన
తెలుగుజాతి ఖర్మ అని వదిలెయ్యటం తప్ప.

సంగీతప్రియుల వెబ్సైటు - sangeetha priya

14 comments:

  1. karanataka sangeetam ante kannada raajulu poshinchaara :-8 ? hmm..chevulaku(karNa) impainadani arthamani ekkado chadivinattu gurtu.

    ReplyDelete
  2. బాగుంది మీ సంగీత పరిచయం.
    కర్ణాటక సరికాదు, కర్నాటక అని రాయాలి అని మన బ్లాగుల్లోనే ఎవరో నన్ను హెచ్చరించారు.
    భారతీయ సంగీత కళ చాలా ప్రాచీనమైనదే అయినా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న కర్నాటక సంగీతం చాలా కొత్తదే. ప్రస్తుతం కచేరీలలో పాడుతున్న పద్ధతి 20వ శతాబ్దపు ఆరంభంలోనే మొదలయ్యింది. 15వ శతాబ్దివారైన పురందరదాసు (కన్నడ దేశస్థుడు) సంగీత బోధనని క్రమబద్ధం చేసినందున కర్నాటక సంగీతమనే పేరు వచ్చిందని ఒక కథనం.

    ReplyDelete
  3. ఈ సందర్భం లో ఈ లింకు కూడా చూడండి...http://www.rasikas.org

    ReplyDelete
  4. >>నన్నడిగితే నాకు తెలిసినంత వరకూ భారతీయుడిగా మనం నేర్చే అత్యంత మోడర్న్ విద్య ఈ శాస్త్రీయ సంగీతం.
    >>అనుభవించడం మొదలెట్టాక రొజుకో వింత అనుభూతి కలుగుతుంది.

    ఇలా ఎక్కువమందికి అనిపిస్తే ఇక గొడవలేదు! :) కానీ

    >>భగవంతుని సాక్షాత్కారమే ధ్యేయంగా రచింపబడిన ఈ సంగీతం ఎంతో సుందరంగా ఉంటుంది. భగవంతుడికి, భక్తికి, భక్తునకు, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది.

    దీంతో వచ్చింది సమస్య. ఇదేదో ఇవ్వాళ్ళ నాస్తికవాదం ప్రబలిపోయిందని కాదు నా బాధ. ఇవ్వాళ దేవుడు ఒక యూజ్ అండ్ త్రో గాడ్జెట్ ఐపోయాడు; ఆ సంగీతంలో దేవుడేమో అలా వర్ణించబడలేదాయె. దాంతో, ఆ సంగీతాన్నే వదులుకుంటున్నారు. సినిమాపాటగా వచ్చినప్పుడు మాత్రం రుచిగానే ఉంటోంది వీళ్ళకి కూడా.

    >>నాక్కాబోయే భార్య "గిమ్మీ మై తాళి మై లైఫ్ ఇజ్ ఖాళీ ఖాళీ" అని పాడేకన్న అరకొరగా ఏ త్యాగబ్రహ్మ కృతే పాడినా నేనెంతో ఆనందిస్తాను. :)) All the best.

    భగవంతుని సంబంధం ఉన్నది ఒక్క సంగీతమే కాదు! మన సర్వకర్మలు కోరికలు భగవంతునితో సంబంధం ఉన్నవే. ఐతే, ఆ భావనని దైనందిన జీవితంలో నిలుపుకోగలిగే విధంగా మన జీవనశైలిని మలచుకునే భాగంలో ఇన్ని రకాల దేవుళ్ళు ఇన్ని రకాల వాయిద్యాలు వాయిస్తున్నారు.పాప్, ఆ పై హిప్-హాప్, ఇప్పుడు రాక్, మెటల్‌తో కూడా, అదే భక్ల్తి,భగవంతుడు, భక్తుల అవినావభావం ఉంది. భక్తి ఉన్న మెటాలిక్ త్యాగరాజులూ దొరకుతారేమో! ఓ సారి చూసి చెప్పండి.

    ఈ సైటుని వాడి చూస్తాను. థాంక్యూ.

    ఇంకో విషయం - క్లాసికల్ = శాస్త్రీయ అని వాడుతుంటాం. ఈ క్లాసికల్ స్టేటస్‌లో ఉన్నవి "మోడర్న్" అని అనరు కదా. కొంచెం రీ-పొజిషనింగ్, రీ-నేమింగ్ చేస్తే, ఈ సంగీతాన్ని మార్కెటింగ్ చెయ్యొచ్చు. స్పెషల్లీ, భాషని/సాహిత్యాన్ని మార్చుకుంటే. దానికి ప్రత్యక్ష తార్కాణం మన సినిమా సంగీతమే. ఐతే, క్లాసికల్ నచ్చేవాళ్ళు, బై ది వెరీ నేచర్, మోడర్న్ వి సృష్టించలేరేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

    ReplyDelete
  5. Karna-Iti-Aataka, Ante chevulaku impu ga vunde sangeetham ani artham ani edo pustakam lo chadivanu.

    ReplyDelete
  6. @all , sorry for delay in recommenting!!!
    @Ravi, whatever it is, its giving the credit name and fame to karnataka, మన సంగీతం ఒక్క చెవులకేనా, మొత్తం శరీరానికి ఉపశమనం కలిగించేది, హాలాహలం తాగినా, దాన్ని కూడా నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలదు మన సంగీతానికి. సో ఇదేదో ముందు పేరెట్టేసి ఆ పై దాని అర్థాలు లెక్కించడంలా ఉంది.
    @Anonymous, thanks first. అటువంటి మెటల్ తరహాలో పాడితే భగవంతునికి కూడా వికారమొస్తుందేమో ??? (just kiddin')
    మన సంగీతమే మోడర్న్ అంటే మళ్ళీ దానికి మోడర్న్ సృష్టించలేమంటారేంటండి? త్యాగబ్రహ్మ బీసీ వారు కాదు
    అచ్చంగా 19వ శతాబ్ది వారు.
    @కొత్తపాళీ: నెనర్లు.
    @harephala thanks for the link sir!

    ReplyDelete
  7. /హాలాహలం తాగినా, దాన్ని కూడా నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలదు మన సంగీతానికి./
    నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం, నే నమ్మలేకుండా వున్నాను. వేదం, నాదం, ఆద్యాత్మికం, హైదవం, ఇస్లాం, జ్యోతిష్యం, తెలుగు సాహిత్యం, కంప్యూటర్ ... మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి లా వున్నారు. మీ దృష్టిలో అలాంటి పాటలేమైనా వుంటే మచ్చుకు కొన్ని చెప్పండి. తెలుసుకోవాలని కుతూహలంగా వుంది.

    ReplyDelete
  8. @snkr గారూ మళ్ళీ నా బ్లాగుకి స్వాగతం
    మీరు వచ్చి చాలా రోజులైన్దనుకుంట
    అబ్బే అందులో నాదేం లేదండీ ప్రతి రెండవ తెలుగోడు ఇంతే
    అయితే జ్యోతిష్యం-నేనూ ???
    బిలహరి రాగామనే ఒక శంకరాభరణం యొక్క డెరివేటివ్ తో రాసిన ఒక పాట ద్వారా త్యాగబ్రహ్మ పుత్తూరు లోని ఒక మనిషికి ప్రాణం పోసారు
    అందులోని సైన్స్ ఏమిటంటే
    రేసోనేన్స్ తో బక్కల్ కావిటీ ని వ్యాకోచిమ్పచేసి కల్మషాన్ని వాంతి అయ్యేలా చెయ్యడం

    సరే మరి బిలహరి లో మంచి పాట :ఇంతకన్నా ఆనందమేమి ఓ రామ రామ.

    ఇంకా మిగతా రాగాలు,ఆయా రాగాలతో నా అనుభూతుల్ని తదుపరి టపాల్లో పంచుకుంటాను

    ReplyDelete
  9. :) ఓ త్యాగరాజు గురించి అన్నారా. బాగుంది.

    ప్రాణమేమో కాని వాంతి వచ్చేలా వాయించగల సంగీత దర్శకులు ఈకాలంలోనే ఎక్కువ. :) మీ సంగీత సంభంధమైన టపాల కోసం చూస్తుంటాను. మీ లింక్ టపా చూశాను. ఆనంద్ సినిమా చూడలేదు, వీలైనప్పుడు చూస్తాను. ఒకటి రెండు పాటలు విన్నాను, గోదావరి ( అక్కినేని మనమడు) సినిమా పాటల్లా అనిపించాయి.

    ReplyDelete
  10. తొలగించుకున్న మీవ్యాఖ్య బాగానేవుంది. మొదట మీకు బూతులొచ్చాయేమో, ఆ తరువాత సర్దుకుని రాశారేమో అని నవ్వుకున్నా.

    హిందోళ రాగం రాని తెలుగు వాడు (ఒక తెలుగువాడేనా?) అని ఎక్కడో ఓ బ్లాగరుడు వ్యాఖ్యానిస్తే నిజమేనేమో అని హిందోళం పాటలు కొన్ని ఆలకించా. ఇప్పుడు మీరేమో బిళహరి రాని వాడు మృతుడే అని దాదాపు అఏస్తున్నారు. ( బ్రతికున్నాను కనుక నేర్వక తప్పదేమో, సరే కానివ్వండి :) ) నాకు సంగీతం రాదు, ఏదో వింటానంతే.(' మోక్షము గలదా ' అని సారమతి లో మాలాంటి వాళ్ళపై త్యాగయ్య సెటైర్ పేసినా, దులిపేసుకుంటామంతే :) )
    నా రాగం అడిగారు, అన్నీ నచ్చుతాయి. గాత్రం, సాహిత్యం బాగుంటే రాగం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. నాకు నచ్చినవి కొన్ని:
    భరవి: అన్నీ బాగుంటాయి ముఖ్యంగా : (కన్నడ నాకు రాదు, ఐనా..) ఇందు ఎనగే గోవింద (కన్నడ ఫిల్మ్ , పిబి స్రీనివాస్/జానకి)
    హిందోళం(మాల్కౌన్స్ హిందూస్థానీ): 1)కలనైనా నీ తలపే(లీల, శాంతినివాసం) 2) శ్రీకర కరుణాలవాల వేణుగోపాల(భానుమతి, బొబ్బిలియుద్ధం) 3) మన్ తరపత్ హరి హర్ (రఫీ, నౌషాద్, బైజూ బావరా) 4) జానె బహార్ హుస్న్ తెరా బే మిసాల్ హై(రఫీ, ప్యార్ కియా తో ఢర్నా క్యా)
    కదన కుతూహలం: 1) 'డ్యూయట్' మూవీలో కదిరై గోపాల్ సాక్స్ ట్యూన్ ( ఎ.ఆర్.రెహమాన్) 2) ఇన్ను దయ బారదే దాసన (యు-ట్యూబ్ లో ధరణి అనే టీన్ అమ్మాయి బాగా పాడింది)
    సారమతి: మనుజుడై పుట్టి మనుజుని సేవించి ( ఎం.ఎస్ అమ్మ, అన్నమయ్య) ఇంకా .. ఎన్నో

    ఇవి యు ట్యూబులో విని మీ అభిప్రాయం తెలిపితే .. అదో తుత్తి, అంతే. :)

    ReplyDelete
  11. @snkr, నేను బిలహరి రాగానికి ప్రమోషన్ ఇస్తున్నా నాకు నచ్చిన రాగం కాబట్టి, అది రాణి వాడు ... అని నేను అనలేదే.
    నేనూ సంగీతం కన్వెన్షనల్ వె లో నేర్చలేదు
    నాకూ సంగీతం అంటే మక్కువ
    అయితే స్కూల్ లో ఉన్నప్పుడు మా సంగీతం మాస్టారు చెప్పిన ఓ నాలుగు ముక్కలే నా సంగీతజ్ఞానం.
    మీరు కన్నడిగుల ప్రభావంలో ఉన్నారేమో తులసి-తుళసి
    బిలహరి-బిళహరి
    మన భాష కోమలాంగి
    వారిది కొంచెం బెరకు భాష

    ReplyDelete
  12. Good.Very useful discussion on classical music.Thanks for references and links.

    ReplyDelete