భారతదేశంలో దాదాపు 8 కోట్ల జనాభా అంతర్జాలాన్ని తరచూ వాడుతున్నారు.
వారు జాలంలో ఎక్కువ సమయాఅన్ని వారి భాషాభివృద్ధికి కేటాయిస్తారు, స్థానికీకరణ, వికీపీడియా వంటివి దీనికి వేదికగా వారు వాడుతున్నారు!
జూన్ ౨౦౦౯ నాటి గణాంకాల ప్రకారం దేశంలో 82 లక్షల బ్రాడ్ బ్యాండ్ అనుసంధానాలు గలవు.
అందులో రమారమీ 2 శాతం అనగా 16 లక్షలు మన రాష్ట్రం వారేఅని అంచనా( బ్రాడ్ బ్యాండ్ ఆధారంగా)
నేటికి ఇవి రెట్టింపు అయి ఉండవచ్చు.
మనం బ్లాగర్ల జనాభానే ప్రాతిపదికన తీసుకుందాం రోజూ కనీసం వంద బ్లాగులు, రెట్టింపు వ్యాఖ్యలు, దానికి రెట్టింపు బజ్జులు అందులో పదో వంతు ట్విటర్ లో తెలుగు వాడకాన్ని చూస్తున్నాం.
మరి వీరిలో చాలా వరకు ఏ ఉద్దేశ్యంతో జాలానికి చేరుతారు, నూటికి తొంభైతొమ్మిదిన్నర మంది వారి మనోల్లాసం కోసమే వస్తారు.
ఈ గణాంకాలను వేరే భాషలవారితో పోల్చుకుందాం!
నాకు హిందీ గుజరాతీ గట్రా బ్లాగుల గురించి విన్నా సమాచారం ఉంది కానీ ప్రత్యక్షంగా గమనించలేదు.
క్షుణ్ణంగా పరిశీలించింది తమిళం మరియు కన్నడం.
అదేవిటో వారి సినిమా, మరియు ఇతరత్రా జాలగూళ్ళు కూడా వారి భాషలోనే ఉంటాయి. కానీ అక్కడవారు బ్లాగటం చాలా తక్కువ, మరి జాలంలో అయితే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరి వారంతా ఏమి చేస్తున్నారు?
వారు జాలంలో ఎక్కువ సమయాఅన్ని వారి భాషాభివృద్ధికి కేటాయిస్తారు, స్థానికీకరణ, వికీపీడియా వంటివి దీనికి వేదికగా వారు వాడుతున్నారు!
వికీపీడియాను నేను ప్రాతిపదికగా తీస్కొని చూసాను, ఆశ్చర్యమేసింది! గణాంకాలు చూసి!
వికీపీడియాలో ప్రతీ వ్యాసం లో ఎన్ని మార్పులు జరిగితే అది అంత మెరుగైనది! నిజం స్థూలంగా!
దీనికి కొలమానం డెప్త్.
హిందీ లో అత్యధిక వ్యాసాలు కలవు, అక్షరాలా 67,449 వ్యాసాలు అయితే హిందీ కి గల డెప్త్ కేవలం 25 అంటే అంత బాగా వ్యాసాలు రాయబడటంలేదు, తరువాత మన భాషే, తెలుగు 47,293 వ్యాసాలు. మురిసిపోకండి, మన డెప్త్ కేవలం 7 అంటే నిమ్నంగా అత్యల్ప డెప్త్! అంతేగా మరి మీరు తెలుగు వికీపీడియాకు వెళ్ళి వ్యాసాలతీరుతెన్ను చూడండి, ఎక్కడో ఒక్కటి 10 లైన్లకు మించి ఉంటుంది. మిగతావన్ని 1 లేదా 2 మరీ మహా అయితే అయిదు లైన్లు గలవే!
ఇది మన భాషకి ఎంతటి అవమానం!
అన్నన్నా!
అలానే వెతుకుతూ మన వెనుక ఉన్నవి గమనిస్తే, తరువాతి వరుసలో ఉన్న మరాఠీ(డెప్త్-20), తమిళం(డెప్త్-31) సంఖ్యాపరంగా మనకు వెనుకంజలో ఉన్నా, డెప్త్ లో మనకు ముందరే ఉన్నారు.
అయితే చెప్పుకోదగ్గది మళయాళం - కేవలం 16 వేల పై చిలుకు వ్యాసాలే ఉన్నా, ప్రతీ వ్యాసం కనీసం ఒక నిర్ణీత లైన్లు ఉండేలా వారు చర్య తీస్కున్నారు. అందుచేత వారికి కొలమానం ప్రకారం డెప్త్ 320! మనం చేరుకోవాలంటే ఇప్పుడున్నా 42 వేల వ్యాసాలన్నిటినీ మనం తీర్చిదిద్దాలి.
మీ ఊరు వికీపీడియాలో ఉంది, కానీ మీ ఊరి సమాచారం, మీ ఊరి బడి, గుడి, చెరువు వికీపీడియాలో కలవా?
వాటి చిత్రాలు?
ఈ విషయాలను వికీ లో చేర్చి మన భాషకే కాదు రాబోయే తరాలకు సమాచారం అందించిన వారవుతారు!
ఇక ఆ తర్వాత నేను గమనించింది విక్షనరీ , ఇది నిఘంటువు
అయితే ఇక్కడ గమ్మత్తు మనకు చాలా వెనుకవున్న అరవం ఇక్కడ మనకు 5 రెట్లు ముందు కలదు
భారతీయ భాషల్లో కూడా మన అరవ సోదరులే ముదలియార్లు!
అక్షరాలా లక్షా తొంభై రెండువేల పైబడి పదాలు కలవు!
ఆ తరువాత స్థానం కన్నడిగులది, ఎనభై ఆరు వేల పైచిలుకు పదాలు
ఆ పై మళయాళం అరవై వేలు +
మరి మనం కేవలం ముప్పై తొమ్మిది వేలు+
తేడా గమనించారా!
మనకు చెప్పుకోటానికే భాషాభిమానం, నిరూపణకు వస్తే సున్నా!
మనకు చెప్పుకోటానికే భాషాభిమానం, నిరూపణకు వస్తే సున్నా!
ఇకనైనా రోజూ మీరు బ్లాగ్గోలలకు పెట్టే సమయంలో ఒక నూరోవంతు వీటిపై దృష్టి పెట్టండి
మీకు వికీ దిద్దుబాటు రాదా, ఉచిత సహాయం అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి!
॥సత్కృతాయాస్తు మంగళం ॥
మంచి ప్రయత్నం, శ్లాఘనీయం, రహమాన్. మీ అసలైన సత్యాన్వేషణని, తెలంగాణా అసత్యాన్వేషణ గా అప్పుడప్పుడూ పొరబడ్డాను. అన్నట్టు నాకింకా తెలుగు అంకెలమీద(అంటే బుద్ధిలేనివాడనే కదా!) పట్టు రాలేదు సుమీ.. :))
ReplyDelete@snkr, చాలా రోజులతరువాత ఇటువచ్చారే! నెనరులు.
ReplyDeleteతెలుగు అంకెలు త్వరగా నేర్చేసుకోండి!
చాలా సులువు!