మనం ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్న సంగణక యంత్రం గురించి చాలా తక్కువ తెలుసు మనకి.
ఈ యంత్రం కనిపెట్ట బడిన తొలినాళ్ళలో దీని ఆకారం చాలా పెద్దదిగా ఉండెడిది. ఎంత పెద్దది అంటే ఒక మొత్తం గదిని నింపేంత.
ఈ సంగణక యంత్రం లో మనకు బాహ్యంగా కనిపించే కఠినాంత్రం మరియు దానిని సక్రమంగా పని చేయించే కోమలాంత్రమూ ఉంటాయి.
కోమలాంత్రము అనేది మనకు కనబడదు.
అయితే తొలి రోజుల్లో సంగణకాన్ని నడిపే కోమలాంత్రంయొక్క మూలసంజ్ఞావళి బాహ్యంగా ఉండేవి.
కోమలాంత్రాన్ని అందరూ తమకు నచ్చినట్టుగా అనుసంధానం చేస్కునే వారు(మూలసంజ్ఞావళిని మార్పిడి చెయ్యటం ద్వారా).
కానీ 6౦ వ దశకం రాగానే , సార్థవాహకాలు (స్వార్థవాహక???) కొన్ని, కోమలాంత్రం యొక్క మూలసంజ్ఞావళిని వాడుకరికి గోప్యంగా ఉంచటం మొదలెట్టాయి. దీని వల్ల సార్థవాహక సార్తవాహకాలకు బోల్లెడు ప్రయోజనాలు కానీ, ఎటొచ్చీ ఒక వాడుకరి ఆ కోమలాంత్రపు లోలోపల గల మూలసంజ్ఞావళిని పరిశీలించడం, మార్చడం కుదురేవి కావు.
అందువల్ల వాడుకరులు స్వేచ్ఛ కోల్పోయారనమాట.
అయితే ఇది ఒక ఇరవయ్యేళ్ళు అలాగే కొనసాగింది, సార్థవాహకాలు మరీ మితిమీరిపోయి అన్ని కోమలాంత్రాల్ని వాడుకరులకు, నిపుణులకు దూరం చేసాయి.
అయితే 8౦వ దశకం లో రిచార్డ్ మ్యాథ్యూ స్టాల్మాన్ అనే ఒక నిపుణుడు ఈ అరాచకత్వాన్ని ఎదిరిస్తూ
స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని మొదలెట్టారు.
తద్వారా అప్పట్లో పేరొందిన అత్యంత జనాదరణ పొందిన యూనిక్స్ కు వికల్పముగా కొన్ని కోమలాంత్రాలను తయారు చేసి వాటిని ఉచితంగా వాటి మూలసంజ్ఞావళి తో సహా పంచిపెట్టటం మొదలయింది - ఇది స్వేచ్ఛాపూరితకోమలాంత్రోద్యమానికి తొలి మెట్టు. అలా పుట్టిందేగ్నూ (ఆంగ్ల అక్షరాలైన G-N-U లతో తయరయింది, దాని విస్తార పదం - GNU=GNU Not Unix, ఇది ఒక ముహుర్పదము ఇందులో GNU పదే పదే పునరావృతమౌతుంది).
అలా గ్నూ కై చాలానే కోమలాంత్రాలు తయారు చేయబడ్డాయి, వాటిలో ముఖ్యమైనవి గ్నూ సి కంపైలర్(GCC), గ్నూ డిబగ్గర్(GDB), మొదలగునవి.
ఇక 9౦వ దశకం మొదల్లో లినస్ టొర్వాల్డ్స్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి యూనిక్స్ యొక్క నుంగు ను అనుకరించి లినక్స్ అనే కొత్త నుంగును కనిపెట్టారు.
ఈ నుంగుపై జీ ఎన్ యూ ద్వారా ఉత్పత్తి చేసిన కోమలాంత్రాల్ని పేర్చి తయారైనదే మన గ్నూలినక్స్ నిర్వహణా వ్యవస్థ.
అందుకనే మనం ఈ నిర్వహణావ్యవస్థను గ్నూ/లినక్స్ నిర్వహణా వ్యవస్థ అనాలి. చాలా మంది లినక్స్ అని మాత్రమే సంబోధిస్తారు, ఇది చాలా తప్పు , లినక్స్ అనేది నుంగు మాత్రమే.
ఇక ఆ పై మొదలు ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటంవలన(మూలశాసనపదాలతో సహా), ఎవరికి నచ్చినట్టూ వారు దీనిని మార్చుకోవచ్చు.
అందువలననే గ్నూ/లినక్స్ కు ఇన్ని రకాల పంపిణీలు ఉన్నాయి. రెడ్ హ్యాట్, ఫెడోరా, మాండ్రివా, ఉబుంటూ, ఓపెన్ సూసీ, డెబియన్, అచ్చంగా మన తెలుగులో తయారైన పంపిణీ-స్వేచ్ఛ. మున్నగువి ఇంకా చాలా చాలా ఉన్నయి.
ఈఎక్స్టీ-2, ఈక్ష్టీ-3 మరియు ఈ ఎక్స్టీ-4 అను విశిష్టమైన దస్త్ర వ్యవస్థ ను వాడటం వల్ల గ్నూ/లినక్స్ వాడుకర్లకు అసలు చాలా ఉపయోగాలున్నాయి.
ఇంకా ఇదే కాకుండా గ్నూ/లినక్స్ వాడుకర్లు, వారిలోనిపుణులు, కలిసి ఈ గ్నూ/లినక్స్ వ్యవస్థ కోసం చాలా కోమలాంత్రాలను రాసారు, రాస్తున్నారు, రాస్తారు కూడా.
మూలసంజ్ఞావళి (ఉచితంగా) అందుబాటులో ఉన్నందున స్థానికీకరణ కూడా చాలా సులువైంది.
తెలుగులోనే పూర్తి స్థాయి నిర్వహణా వ్యవస్థలు ఉన్నాయి.
ఉదాహరణకు: స్వేచ్ఛ, ఉబుంటు-తెలుగు, డెబియన్-తెలుగు మున్నగునవి.
మీరూ మీ వంతు సహాయాన్నీ అందిచవచ్చు. లాంచ్ప్యాడ్ వంటి ప్రదేశాలలో మీరు ఏ కార్యక్రమించడం తెలియకపోయినా స్థానికీకరణకు సహాయం చెయ్యొచ్చు, తద్వారా చాలా మేలు చేసిన వారవుతారు మన భాషకు.
అయితే ఈ టపా లో అర్జున్ గారు చెప్పినట్టు ఇంకా చాలా చెయ్యవలిసి ఉంది నిపుణులు, వాడుకర్లు ముందుకు వచ్చి మీ ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా చెయ్యవచ్చు మనం.
'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స'
list of tech jargons in telugu:
- సంగణక యంత్రం : Computer
- కఠినాంత్రం : hardware
- కోమలాంత్రము: Software
- మూలసంజ్ఞావళి : source code
- శాసనపదం : command
- సార్థవాహకాలు (స్వార్థవాహక????): company
- వాడుకరి : user
- నిపుణుడు : developer
- స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని : Free Software Movement
- నుంగు : kernel
- నిర్వహణా వ్యవస్థ : Operating System
- పంపిణీ(used as a noun here) : Distro (Distribution)
- దస్త్ర వ్యవస్థ : file సిస్టం
- కార్యక్రమించడం : programming
సాంకేతిక పదాలను తెలుగులో అనువదించి రాస్తున్న మీ ప్రయత్నం సంతోషకరంగా ఉంది రహ్మానుద్దీన్ గారు. ఒక చిన్న విన్నపం.....చాలా ఆంగ్ల పదాలకు సమానమైన తెలుగు పదాలు అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి తెలుగు అనువాదం పక్కన ఆంగ్ల మాతృకకుడా రాస్తే బాగుంటుందనుకుంటున్నా
ReplyDeleteGood beginning. But, GNU ని గ్ను అంటే కృతకంగా వుంది
ReplyDelete@ above
ReplyDeleteవత్తన్నా వత్తన్నా మీ పాయింట్ కే వత్తన్నా
ఈ టపా రాయటం మొదలెట్టగానే పవర్ పోయింది అందుకని గబ-గబా రాసి సేవ్ చేసా సశేషం అంటే దీనికి సీక్వెల్స్ కాదు, ఇదే పోస్ట్ మళ్ళీమళ్ళీ ఎడిట్ చేస్తానని.
@WitReal
ReplyDeleteమరి ఏదైనా వినసొంపైన పదాన్ని మీరే ఇవ్వండి, నాకూ ఏమీ తోచక అలాపెట్టాను.
"జి ఎన్ యు" అంటే పోలా!
ReplyDeleteజే ఎన్ యూ లా
ReplyDeleteజీ ఎన్ యూ అని పిలవడమే బెటర్ :)
రహ్మానుద్దీన్ షేక్ గారు
లినక్స్ పై అవగాహన కోసం చాలా సమాచారం అందిస్తున్నారు
మంచి ప్రయత్నం
అభినందనలు
@ above
ReplyDeleteమార్చానండి
@ హరే కృష్ణ
థ్యాంక్లు
GNUని "గ్నూ" అని పలుకుతారు పలకాలి.
ReplyDeleteగ్నూ వారి సైటు నుండి: [...] it is pronounced g-noo, as one syllable with no vowel sound between the g and the n.
వీవెన్ గారూ మొదట గ్నూ అనే పెట్టాను కానీ అది కృతకంగా ఉందని వ్యాఖ్యానించారు
ReplyDeleteఇప్పుడెం చెయ్యాలి, మళ్ళీ జీ ఎన్ యూ ని గ్నూ గా మర్చేయనా?
SAP ని శాప్ అని & GNU ని గ్నూ అని అనటం తక్కువ.
ReplyDeletebtw,
ReplyDelete>> లినక్స్ తెలుగు వాడుకర్ల సంఘం
దీనికి LUG short name ఏమీ లేదా?
TLUG ని టోక్యో వాల్లు, TELUG ని వేరే వాల్లు అల్రెడీ తీసేసుకున్నారు.
@WitReal,
ReplyDeleteSAP సంగతి నాకు తెలియదు కానీ, GNU ని గ్నూ అని అనటమే తొలి నాళ్ళలోంచే తెలుసు, ఆ పేరుతో గల జంతువు(కొద్దిగా దుప్పికీ, బర్రె కు మధ్య పోలికలతో ఉంటుంది) ని మనం గ్నూ కి చిహ్నంగా mascot గా కూడా వాడుతున్నాము.
అయితే నేనీమధ్య కలిసిన హైదరాబాదీ గ్నూ/లినక్స్ అభిమానులు(స్వేచ్ఛ వారు, ilugh వాళ్ళూ గట్రా) జీ ఎన్ యూ అంటూ పలుకుతుంటే అదే కరెస్ట్ అనుకున్నా.
ఇకపోతే LUG/GLUG=Linux Users Group లేదా GNU/Linux Users Group
సో అది ప్రపంచీకరణ ఔతుంది కానీ మన లక్ష్యం స్థానికీకరణ కాబట్టి పూర్తిగా పిలవటమే సార్థకం లేదా లి.తె.వా.సం అంటే సరిపోలా.
అయినా పై పదాన్ని short చేస్తే వచ్చేది LTUG కదా!!
నేను టపాలో చెప్పినట్టు గ్నూ-లినక్స్ అవిభాజ్యాలు(మనం ఒక నిర్వహణా వ్యవస్థ గురించి మాట్లాడేప్పుడు మాత్రమే సుమా!
అందుకని గ్నూలినక్స్ తెలుగు వాడుకర్ల సంఘం అంటే సరిపోతుంది.
ప్రయత్నం బాగుంది. నేనూ ఉబుంటు వాడుకరిని.
ReplyDelete- ఇన్ని తెలియని సాంకేతిక పదాలు తెలుగులో తెలుసుకొనడం సంతోషమైనా, "కంపెనీ" పంటికింద రాయిలా తగిలిందండి.
- "అంత్రం" (కోమల + అంత్రం) అనే తెలుగు పదానికి అర్థం ఏంటండి?
@JB
ReplyDeleteథ్యాంక్లు
కంపెనీ ని సార్థవాహకమంటారని telugupadam.org చెప్పింది
ఆ విధంగా మార్పులు చేసాను
అయితే అంత్రం అనే పదాన్ని నేను telugupadam.org నుంచి అప్పు తెచ్చాను
దాని అర్థం, అది యంత్రం కి మార్పు అయినా అయి ఉండాలి
లేదా లోపల (అంతరంలో) ఉంటింది కాబట్టి అలా అయినా చెప్పండవచ్చు
వీవెన్ గారిని కనుక్కోవాలి
అయితే నేను చదువుకున్న సంస్కృతం నాకు అన్త్రమ్ అంటే పేగు అని చెప్తోంది
ReplyDelete@రహ్మానుద్దీన్:
ReplyDeleteమీరిచ్చిన సైట్లో 'సార్ధవాహం' అని ఇచ్చారు. ఈ పదం ఎలా తయారయ్యిందీ, మూలం ఏంటి తెలుసుకోవాలని వుంది. ఆ సైట్లో చెప్పలేదు. వాహకం మాధ్యమంలాంటిది. భౌతిక శాస్త్రం (ఫిజిక్స్)లో "కండక్టర్ " అనే అర్థములో వాడినట్లు గుర్తు.
శుభ్రంగా సంస్థ అంటే పోలా (సంస్క్రృతమూలమైనా)!
అంతరం అంటే 'తేడా' అయినపుడు అంత్రం కూడా అదే అర్థం ఇవ్వాలి కదా. యంత్రం అయితే, నాకు తెలిసిన తెలుగు వ్యాకరణం గుణసంధి ప్రకారం, కోమల + యంత్రం = కోమల్యాంత్రం అవ్వాలి.
మీ వ్యాసంలో ఈ అప్రస్తుత వ్యాఖ్యానానికి క్షంతవ్యుడిని. ఇప్పుడే తెలుగుపదంలో చేరి అక్కడడుగుతా!
సుత్తి వీరభద్రరావులా "అర్థం తెలీదు, బాగుందని వాడా" అన్నట్టుంది.
ReplyDeleteAnonymous : ?????????
ReplyDelete