మంచి వీణను తయారు చేసావు - దానిని చెత్తకుప్పలోకి పడేస్తావా?
చెప్పు, శివశక్తీ!!! ఎందుకని నన్ను ఈ జ్ఞానంతో పుట్టించావు?
నాకు శక్తినిస్తావా - ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా జనం బ్రతకేలా నేను చెయ్యాలి!
చెప్పు, శివశక్తీ!!! వారు ఈ భూమికి భారమై బ్రతకాలా?
నేను చెప్పినట్టూ ఆడే బంతిలా, నా శరీరం నా బుద్ధి చెప్పినట్టూ ఎక్కడికయినా వెళ్ళిపోవాలి
కల్మషంలేని బుద్ధినివ్వు శివశక్తీ, జీవితానికే జీవితాన్నిచ్చే జీవితాన్ని ప్రసాదించు శివశక్తీ!!!
ఈ శరీరం కాలి బూడిదయ్యాక కూడా నీ పాటలే నేను పాడాలి, అలాంటి నన్ను నాకివ్వు శివశక్తీ
అచంచలమయిన ఆత్మవిశ్వాసాన్నే కదా నేనడిగింది, నాకివన్నీ ఇవ్వటానికి నీకేమయినా అభ్యంతరమా శివశక్తీ?
సత్యమే నిలుచుగాక ఓం ఓం ఓం మూలం : సుబ్రహ్మణ్య భారతి రచన மனத்தில் உறுதி வேண்டும் மனதி லிறுதி வேண்டும் வாக்கினி லேயினிமை வேண்டும் நினைவு நல்லது வேண்டும் நெருங்கின பொருள் கைப்பட வேண்டும் கனவு மெய்ப்பட வேண்டும், கைவசமாவது விரைவில் வேண்டும், தனமும் இன்பமும் வேண்டும், தரணியிலே பெருமை வேண்டும், கண் திறந்திட வேண்டும், காரியத்தி லுறுதி வேண்டும், பெண் விடுதலை வேண்டும், பெரிய கடவுள் காக்க வேண்டும் மண் பயனுற வேண்டும், வானகமிங்கு தென்பட வேண்டும், உண்மை நின்றிட வேண்டும், ஓம் ஓம் ஓம்.
అమ్మాయీ, నీ కనులు చంద్రుళ్ళోని కళనూ, సూర్యుని తేజాన్ని కలిగి ఉన్నాయి!
నల్లని గుండ్రనికనులు - రేయాకాశపు నల్లనితనాన్ని లాక్కున్నవా? మెరిసే వజ్రాలు పొదిగిన సరికొత్త నల్లపట్టుచీర కట్టావు - నడిరేయి ఆకాశాన గల తారల్లా. అప్పుడే పూచిన పూల సుమగంధపు నవ్వు నీది నీలసంద్రపు అలలు నీ హృదయ ప్రేమ తరంగాలు నీ గళం - తీయని కోకిల గళం అమ్మాయీ నేను నీ ప్రేమలో పడ్డాను ఏవో కట్టుబాట్లూ, నియమాలూ అంటున్నావు అమ్మాయీ అవి ఎందు కోసం? కోపావేశాల్లో మరిగిపోయే వారికే కదా ఆ కట్టుబాట్లూ, ఓ అమ్మాయీ! పెద్దల అంగీకారంతో పెళ్ళీ క్రతువులు ఆనకి చేసుకొనవచ్చు నేను వేచి ఉన్నాను, చూడూ ఓ ముద్దుకై. ఓ అమ్మాయి!