Thursday, September 29, 2011

காக்கைச் சிறகினிலே நந்தலாலா

సుబ్రహ్మణ్య భారతి - భారతియార్ రాసిన కవితలెన్నో, వాటిలో నేను నేర్చుకున్న ఒక చిరు కవిత. 
నాకెంతో ఇష్టమయినది.
అన్నట్టు ఇది ఆనంద్ తమిళ రిమేక్, నినైతలే లో కూడా ఉంది, ఆ ఆడియో మీ కోసం




காக்கைச் சிறகினிலே நந்தலாலா - நின்றன்
கரியநிறம் தோன்றுதையே நந்தலாலா


பார்க்கும் மரங்களெல்லாம் நந்தலாலா - நின்றன்
பச்சை நிறம் தோன்றுதையே நந்தலாலா


கேட்கும் ஒலியிலெல்லாம் நந்தலாலா - நின்றன்
கீதம் இசைக்குதடா நந்தலாலா


தீக்குள் விரலை வைத்தால் நந்தலாலா - நின்னைத்
தீண்டும் இன்பம் தோன்றுதடா நந்தலாலா





ఈ పాటకి భావం సౌమ్య గారు బజ్ లో ఇచ్చారు (https://plus.google.com/111060331959395474623/posts/j766Z6R1iqy)

sowmya alamuru - ఇది కృష్ణుడి గురించి పాడుతున్న పాట:

ఓ నందలాల

కాకిరెక్కల్లోని నలుపుని చూసినప్పుడల్లా
నీ శరీరపు నీలవర్ణమే గుర్తొస్తుంది

పూదోటల్లోని పచ్చదనం చూసినప్పుడల్లా
నీ పచ్చని ఛాయ గుర్తొస్తుంది

ఏ మధుర గేయాన్నీ విన్నా
నీ అమృత గానామే గుర్తొస్తుంది

అగ్నిలో వేలు చురుక్కుమన్నప్పుడు
అతీతశక్తిగల నిన్ను తాకిన భావం కలుగుతుంది.

3 comments:

  1. ఇదిగో అబ్బాయా? తెలుగు బ్లాగుల్లో ఇట్టా అరం రాసేస్తే మాకేం అర్దమవతాది?
    రాసేదేదో అరం ని తెలుగులో రాసేస్తే కొంచెం అర్ధమవతాది. :-)

    ReplyDelete
  2. సౌమ్య గారు అర్ధాన్ని చెప్పారు, అది ఇక్కడ చేరుస్తున్నాను.

    ReplyDelete
  3. ఇది చదివే ఇక కుదురుగా ఉండలేకపోయాను...రెహ్మాన్...థాంక్యూ సో మచ్! సౌమ్యా కి కూడా..

    ReplyDelete