Wednesday, February 22, 2012

భాషందం అజంతం

మన భాష అందమైన భాష. అజంతమైన భాష.
మరి ఈ అజంతమనగా ఏంటి?
అజంతం -- అచ్చు+అంతం.
అనగా అచ్చుతో అంతమయ్యేది.
తెలుగు నుడి ఇది -- ఏ పదమూ హల్లులతో ముగియదు!
అమ్మ - అ తో ముగుస్తుంది
ఆవు - ఉ తో ముగుస్తుంది
ఇల్లు - ఉ తో ముగుస్తుంది
ఈగ - అ తో ముగుస్తుంది
...

మానస్ - స తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం
రమేశ్ - శ తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం కూడా కాదు (సంస్కృతంలో నపుంసక లింగం)

...

మన భాష హల్లుతో ముగియదు, హలంతం కాదు. అజంతం, అమరం, అందం.

అదనమాట సంగతి

Monday, February 20, 2012

తెలుగదేలయన్న

ఈ టపా మొదలు కొన్ని గంభీరమయిన టపాలు ఇక్కడ ప్రచురితమవనున్నాయి.
అన్ని టపాల్లోనూ తెలుగు భాషపై నా ఆలోచనలు పంచుకోనున్నాను.

ఈ టపాలో :  తెలుగదేలయన్న
ఎన్నో సందర్భాల్లో ఈ పై పదాన్ని జనం వాడేస్తారు(అర్ధం తెలిసి వాడతారా లేక అజ్ఞానంగా ఏదో చెప్పేదానికి వెయిట్ ఇవ్వాలని వాడతారా? అనే ప్రాథమిక అనుమానం వచ్చినా అభివాదన శీలస్య గుర్తొచ్చి కంగా ఉండాలి :P).
నేను ఒకటి రెండు సందర్భాల్లో చాలా ఫూలిష్ కాంటెక్స్ట్ లలో వాదేసాను.
అయితే వీవెన్ గారు ఒక రోజు మాటల సందర్భంలో దేసభాశాలందు తెలుగు లెస్స అన్న పద్యం గురించి కారకా తెచ్చారు, అర్ధం చెప్పమన్నారు.చెప్పకపోతే నన్ను తక్కువ అంచానా వేస్స్తారని భయం. సెప్తే మన మందబుద్ధి బయట పడిద్దనే పీడ. మొత్తానికి అంతకు ముందొకసారి వికీపీడియాలో కృష్ణదేవరాయలు వ్యాసంలో చదివింది గుర్తొచ్చి నెమరవేసుకున్నా.
 “తెలుఁగదేలనన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ దెలుఁగొకండ
యెల్ల నృపులగొలువ నెరుఁగ వే బాసాడి
దేశభాషలందుఁ తెలుఁగు లెస్స”
                                        —శ్రీ ఆంధ్ర విష్ణు

ఇక సందర్భానికొద్దాం శ్రీకృష్ణదేవరాయలవారు తెలుగులోనే ఆముక్తమాల్యదను ఎందుకు రాయాలి అని శ్రీకృష్ణదేవరాయలకు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే ఆంధ్రమహావిష్ణువుగా పలికెనని సాహితీ సమరాంగణుడే చెప్పెను.

 తెలుఁగదేలయన్న - తెలుగు అది ఏలయు అనిన

అడనమాట సంగతి ....

Thursday, January 19, 2012

క్యూఆర్ కోడ్


క్యూఆర్ కోడ్ అనేది క్విక్ రెస్పాన్స్ కోడ్ కు సంక్షిప్త రూపం. ఇది ఒక 2-డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బార్ కోడ్. మొట్టమొదట ఆటోముబైల్ ఇండస్ట్రీ కోసం కనుగొన్నారు. ఎక్కువ పదాలను ఒక చిన్న బొమ్మ రూపంలో పొందుపరచటం మరియు త్వరిత పఠనీయతవల్ల ఈ టెక్నిక్ బాగా ప్రాచుర్యం పొందింది. తెలుపు బ్యాగ్రౌండ్ లో నలుపు రంగు చతురస్రాలతో ఒక సందేశాన్ని గూఢంగా ఉంచడమే ఈ టెక్నిక్. అంకెలు, అక్షరాలు+అంకెలు, బైట్/బైనరీ మరియు కంజి(జపానీయుల లిపి) -- ఈ నాలుగు రకాల సందేశాలను క్యూఆర్ కోడ్ ద్వారా భద్ర పరచవచ్చు. టొయోటా అనుబంధ సంస్థ అయిన డెన్సో 1994 లో వాహనాల తయారీని అంచనా వేసేందుకు బార్ కోడ్ యొక్క 2 డైమెన్షన్ రూపాన్ని వాడారు. అతి వేగంగా ఎన్కోడ్(గూఢీకరణ) మరియు డీకోడ్(నిగూఢీకరణ) అయ్యే విధంగా ఈ కోడ్ ను రూపొందించారు. అమెరికా, కెనడా మరియు హాంగ్‍కాంగ్ లలో క్యూఆర్ కోడ్ వాడుక అధికంగా ఉంది.

qrcode
నా పేరు బ్లాగు పేరు, నా ఫోన్ నంబర్, ఈ మెయిల్ ను పొందుపరిచిన క్యూఆర్ కోడ్

పై బొమ్మలో చూపిన విధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇదివరకే ఈ తరహా కోడ్ ను మీరు పత్రికల్లో, బిజినెస్ కార్డ్లపై ఇంకా మరెన్నో చోట్ల చూసే వుంటారు. ఈ క్యూఆర్ కోడ్ లో ఉన్న సమాచారాన్ని ఫోన్ ద్వారా స్కాన్ చేసి అప్పటికప్పుడే ఏం రాసుందో తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వంటి స్మార్ట్ ఫోన్లలో ఈ కోడ్ ను ఇట్టే చదవవచ్చు.
మీ పేరు లేదా ఏదయినా సమాచారాన్ని ఇప్పుడే క్యూఆర్ కోడ్ గా మార్చండి. http://qrcode.kaywa.com/ కు వెళ్ళి మీ సొంత క్యూఆర్ కోడ్ ను పొందండి.

Thursday, December 15, 2011

తెలుగు వికీపీడియా లో జాలాధారిత ఖతులు

ఇక పై తెలుగు వికీపీడియా లోని వ్యాసాలను లోహిత్ తెలుగు, పోతన, వేమన ఖతులలో చూడవచ్చు.

దీనికి సంబంధించిన అమరిక కుడి వైపు పైన ఉన్నా లంకెలలో మొదటి దాని పై మౌస్ ను నిలిపితే కనిపిస్తుంది.




Friday, October 21, 2011

మధుశాల - హరివంశ్ రాయ్ బచ్చన్

స్కూల్ రోజులు జ్ఞాపకం వచ్చాయి
కవితల పఠన పోటీల్లో మొదటి బహుమతి తెచ్చిపెట్టిన కవిత ఇది
ఈ కవితను స్వరపరచటానికి పట్టిన సమయం నెల రోజులు.
హరివంశ్ రాయ్ బచ్చన్ గారి మధుశాల కవిత...

భావుక్తా అంగూర్ లతా సే ఖీంచ్ కల్పనా కీ హాలా
కవి బన్ కర్ హై సాకీ ఆయా భర్ కర్ కవితా కా ప్యాలా
కభీ న కణ్ భర్ ఖాలీ హోగా లాఖ్ పియే దో లాఖ్ పియే
పాఠక్ గణ్ హై పీనే వాలే పుస్తక్ మేరీ మధుశాలా....


భావుకత అనే ద్రాక్షాల నుండీ కల్పన అనబడే రసాన్ని తీసి
మద్యం అమ్మే వాడిగా కవిత అనే సారాయి భాండంతో వచ్చాడూ కవి
లక్షల మంది తాగినా తరగని మద్యమది.
పాఠకులు మద్యసేవకులైన వేళ నా పుస్తకం ఒక మధుశాల(మద్యం అంగడి)

ముసల్మాన్ ఔర్ హిందూ హై దో ఏక్ మగర్ ఉన్కా ప్యాలా
ఏక్ మగర్ ఉన్కా మదిరాలయ్ ఏక్ మగర్ ఉన్కీ హాలా
దోనో రెహ్తే ఏక్ న జబ్ తక్ మందిర్ మస్జిద్ మే జాతే హై
లడ్వాతే హై మందిర్ మస్జిద్, మేల్ కరాతీ మధుశాలా....


మొహమ్మదీయులు-హిందువులు ఇద్దరూ వేరు వేరు, కానీ వారి మద్యం సీసా ఒకటే
వారు వెళ్ళే మద్యం అంగడి ఒక్కటే, వారు తాగే మద్యం ఒకటే
వారిరువురు వారి వారి ధర్మ స్థలాలకు వెళ్ళే వరకే ఒకటి, అక్కడకు వెళ్ళాక ఇద్దరు పరస్పర విరోధులు
మతం మనిషిని గొడవల్లోకి లాగితే మధుశాల మనుషుల్ని కలుపుతుంది.