Saturday, October 23, 2010

ఉబుంటు పంపకంలో తెలుగు ఖతులను స్థాపించే విధానం

ఉబుంటు పంపకంలో by default, పోతన మరియు వేమన ఖతులు ముందుగానే స్థాపితమై ఉంటాయి. అవి కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు.
ఒకవేళ మీరు కొత్త ఖతులు స్థాపన చేయదలచుకుంటే, అదెంతో సుళువు.
ముందుగా ఆయా ఖతులను డౌన్లోడ్ చేసుకుని ఆ టీటీఎఫ్ దస్త్రాలను su గా 
/usr/share/fonts అనే ఫోల్డర్ లోకి కాపీ చేస్కోండి ఆ పై ఈ కమాండ్ ను రన్ చెయ్యండి 
fc-cache -fv
ఇది రన్ చేసాక మీ యంత్రంలోకి ఆయా ఖతులు స్థాపితమవుతాయి 
లేదా పై కమాండ్ ను రన్ చెయ్యకుండానే సిస్టంను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది 
కొన్ని మంచి తెలుగు ఖతులు :

7 comments:

  1. మీ సూచనలు చాలా ఉపయుక్తం. నెనరులు. కానీ ఇండియాలో ఎవఱైనా ఉబుంటు నిర్వహణవ్యవస్థని వాడతారని అనుకోను. అసలిక్కడ కార్యాలయ కలనయంత్రాల నుంచి మాత్రమే పనిచేస్తారు. అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో గానీ ఇళ్ళలో అవి ఉన్నవాళ్ళు చాలా తక్కువ.

    ReplyDelete
  2. నేనున్నది అందుకే కదండీ, ఇంతకు మునుపే ఉబుంటూ వాడకంలో గల ఉపాయాలని చెప్పాను
    అలానే హైదరాబాద్ లో ఉండే వాళ్ళ వద్దకు వచ్చి స్థాపిస్తానని కూడా చెప్పాను
    కానీ ఇంకా ఎవరూ స్పందించలేదు అది వేరే విషయం
    అయితే ఉబుంటూ వాడటం వల్ల కలిగే సదుపాయాలు చాలానే ఉన్నాయి ఎప్పుడైనా కలిసినప్పుడు చర్చిద్దాం

    ReplyDelete
  3. IRS 2009 సర్వే ప్రకారం (లింకు వికీపీడియా వ్యాసానికి) ఆంధ్రప్రదేశ్ లో 3,74,000 మంది ఇంటినుండి అంతర్జాల సౌకర్యం కల వారున్నారు. వారిలో కొంతమందైనాఉబుంటు వాడుకరులుగా మారటానికి రహ్మనుద్దీన్ గారి సహాయం ఉపయోగపడగలదు

    ReplyDelete
  4. మీరు ఉబుంటులో ఎఇర్‌టెల్ వారి బ్రాడ్‌బాండ్ సదుపాయానికి అమరికలు చేసిపెట్ట గలరా?

    ReplyDelete
  5. @Anil: లక్షణంగా చెయ్యొచ్చు

    ReplyDelete
  6. మా శ్రేయోభిలాషి ఒకరు ఇలా చెప్పారు:


    "చాలా ఆశ్చర్యం.. తాడేపల్లివారి వ్యాఖ్య చాలా అభ్యంతరకరం.
    నేను ఇండియాలోనే ఉంటాను.. అదీ ఒక చిన్న పల్లెలో.
    కంప్యూటరు మేధావినీ కాను.
    కానీ నేను ఉబుంటు నిర్వహణ వ్యవస్థను వాడుతున్నాను.. గత మూడేళ్ళుగా.
    విండోస్ వ్యవస్థను మరీ గతిలేకపోతే తప్ప, వాడను. ఎప్పుడైనా వాడాల్సివస్తే
    ఆ కొద్ది సేపట్లో పదిసార్లు ఉబుంటు గొప్పతనాన్ని కీర్తిస్తూ వాడతాను.
    అంతేకాదు.. కొత్తపల్లి పత్రిక (http://kottapalli.in) ను మొత్తం ఉబుంటు
    మాధ్యమంగానే వెలువరిస్తున్నాం. మూడేళ్ళుగా! బొమ్మలు స్కాన్ చేసుకోవటం
    దగ్గర్నుండి ఇమేజ్ మానిప్యులేషన్ వరకూ, సంగీతం సవరించటం, తెలుగు టైపింగు,
    ఎడిటింగు, చివరికి పిడియఫ్ చేయటం- అన్నీ ఉబుంటులోనే కదా చేస్తున్నది?
    "ఎవ్వరూ వాడరు" అని అలా blanket statement ఇచ్చేస్తే ఎలా?
    తప్పు.

    తాడేపల్లి వారు క్షమించాలి. "

    ఈ బ్లాగుకు సంబంధించినది కాబట్టీ పోస్ట్ చేస్తున్నాను

    ReplyDelete
  7. ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించాలి. I like Fedora and Redhat very muh. May I know why is that I should be usig Ubuntu. I tried installing this once and required me to connect to internet. Feel free to mail me arun.1202 at gmail.com. Thank you very much

    ReplyDelete