Tuesday, October 5, 2010

కొత్తవారికి లినక్స్ పంపకం

ఇదివరకే  లినక్స్ పంపకాల గురించి ఇక్కడ చర్చ జరిగింది చూడగలరు.
అయితే విండోస్ కంటే ఎన్నో రెట్లు మేలయినదని అనుకుంటున్నాం కదా లినక్స్ ను
అందుకని లినక్స్ కు మారదామా అంటే ఒక పెద్ద చిక్కుప్రశ్న ఏపంపకం వాడాలి అని
పక్కింటి శ్రీను డెబియన్ ది బెస్ట్ అంటాడు ఎదురింటి రాజు ఫెడోరా బెటర్ దాన్ ది బెస్ట్ అంటాడు ,
ఇక మన హేచోడీ లేదా ప్రొఫెసర్ ఆయన వాడిన రెడ్ హ్యాట్ మాత్రమే ఒక అసలైన పంపకమనీ
మిగతావి వేస్ట్ అని కొట్టిపారేస్తాడు.
అయితే లినక్స్ వాడే వారికి అన్నిరకాల వేసులుబాట్లూ ఉంటాయి.
ఇన్ని చాయిస్లు ఉన్నయ్యంటే అది ఎంత బెస్ట్ అన్నది మీరే చెప్పగలరు
ఆ మధ్య ఒక టపాలో ఎవరో ఫ్రీ సాఫ్ట్వేర్ అంటున్నారు జీవితం లో అన్ని ఫ్రీగా రావు కదా అని
ఆయనకు ఈ టపా ఎలాగోలా చేరాలి ఆయన దీన్ని చదవాలి
ఆంగ్లం చాలా చిన్ని భాష, వారి దేశం ఎంత చిన్నదో బ్రిటీష్ వారి భాష కూడా అంటే చిన్నది
వారికి ఎక్కువ పదాలు లేవు
మనం స్వాతంత్ర్యం అన్నా, స్వేచ్ఛ అన్నా, ఉచితం అన్నా
ఈ మూడింటికీ వారి దగ్గర ఒక ఫ్రీ అన్న పదమే ఉంది
(ఇంకా చెప్పాలంటే మాకు ఒక ౬ పేజీల పాఠం హిందీ ౮వ తరగతిలో ఉంది అందులో కూడా ఇండెపెండెన్స్ డే అంటే  అపరతంత్ర దినోత్సవం అన్న అర్థం వస్తుంది కానీ మనం స్వాతంత్ర్యదినోత్సవం అంటాం అంటూ ఆరు పేజీల సుత్తి)
చెప్పొచ్చేదేమిటంటే ఫ్రీ అంటే అర్థం ఉచితం కాదు తండ్రీ, ఫ్రీ అంటే స్వేచ్ఛ


అయితే నా స్వంత పూచీ మీద మీరు ఉబుంటు ని కళ్ళు మూస్కుని సారీ కళ్ళు తెరిసే అనుసంధానం చేసేస్కోండి
ఒక వేల మీరు పూణే వాసులైతే నేనే మీ వద్దకొచ్చి ఉచిత(ఫ్రీ)ముగా చేసి పెడతాను
ఉబుంటు డెబియన్ ఆధారిత పంపకం
మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే
ప్రతీ పంపకానికి కొన్ని ప్యాకేజేస్ ఉంటాయి
అవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి
వాడుకరులు ఎంతమంది ఉన్నారు వీరిలో ఎంతమంది అంతర్జాలంలో సహాయం చేస్తున్నారు
మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు ఆ పంపకంలో ఉన్నాయా
ఇవన్నీ ముందు తెలుసుకోండి
ఇక పొతే నా సలహా ఏమిటంటే ఒక వేల మీ వద్ద అంతర్జాలం అనుసంధానించి ఉంటే ఉబుంటు మేలు
లేదా డెబియన్ బావుంటుంది.
ఉబుంటూ లో మీరు కావాల్సిన అన్ని ప్యాకేజ్లను డౌన్లోడ్ చేస్కొని మీ డెస్క్టాప్ తో ఎన్నో చెయ్యవచ్చు
తెలుగు స్థానికీకరణ కూడా ఉబుంటు లో బాగుంటుంది
నేను ప్రస్తుతం 9.10 వాడుతున్నాను
ప్రతి ఏడు ఏప్రిల్ మరియూ అక్టోబర్లలో కొత్త వెర్షన్ వస్తుంది
ప్రస్తుతం 10.04 చలామణి లో ఉంది
ఇవాలో రేపో 10.10 రాబోతోంది
అయితే చాలా మంది 10.04 లో కొన్ని అవగుణాలున్నాయని చెప్పారు
సో 9.10 లో నాకేమి గ్లిచెస్ కనపడలేదు
మీరూ అదే వాడండీ !!!!

8 comments:

 1. రెహ్మాన్ గారు..., మీరు ఉబుంటు బెస్టు అన్నారుకదా అని 10.04 ఇన్‌స్టాల్ చేసుకున్నా.....చేసేముందు మీ పోస్టు ఓసారి చూడాల్సింది. ఐతే ఉబుంటులో ప్రస్తుతమున్న తెలుగు ఫాంట్స్ నాకు నచ్చడం లేదు. బరహ లాంటి లినక్స్ compatible ఎడిటర్ ఏదైనా ఉందా ?

  ReplyDelete
 2. 10 .04 లో ప్రొబ్లెంస్ ఉన్నాయ్
  నేను 9 .04 వాడుతున్నా

  ReplyDelete
 3. nagarjuna గారూ, గూగుల్ టాక్ లో నన్ను ఆడ్ చేస్కోండి
  ఆన్లైన్ లో మాట్లాడొచ్చు
  ఇదివరకే 9.04,9.10 వాదినవారికి ఇబ్బంది కానీ కొత్తవారికి ఏ రాయైతె ఏమిటండి పళ్ళు రాలటానికి?
  you can use 10.04 comfortably. no regrets.

  ReplyDelete
 4. ఉబుంటు 10.04 సిస్టం రిక్వైర్మెంట్స్ ఏమిటి.అన్ని పెరిఫెరల్స్‌కి డ్రైవర్స్ దొరుకుతాయా.నేనింతకు ముందు ఫెడోరా వాడి చాల ఇబ్బంది పడ్డానండి.ఇప్పుడు నోపిక్స్ లేటెస్ట్ వెర్షన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?ప్లీజ్?

  ReplyDelete
 5. వజ్రం గారూ, సిస్టం రిక్వైర్మెంట్ కోసం ఇక్కడ చూడండి
  నోపిక్స్ కూడా డెబియన్ జన్యకమే, ఉబుంటు లాగా
  మీకు అన్ని రకాల స్వేచ్ఛమృదోపకరణాలు ఇక్కడ లభిస్తాయి
  సీడీ ధర రూ.౨౫(పాతిక),డీవీడీ ధర రూ.౩౦(ముప్పై)
  కొరియర్ ద్వారా మనకు పంపిస్తారు.
  ఇక నోపిక్స్ఇక్కడ చూడండి.

  నోపిక్స్ ISO ఇమేజ్లు ఇక్కడ చూడండి FTP ద్వారా డౌన్లోడ్ చేస్కోండి

  ReplyDelete
 6. Hi:

  This question has been lingering in my mind for so many days. You also voted for Ubuntu. Long time back, I used RH 9, FC2 & FC3. I didn't like them.

  I don't have internet connection at room, so I heard that I need to get the Ubuntu Ultimate Edition. Isn't it? Because, people say that the normal Ubuntu DVD will have basic functionality and during installation it'll download the remaining from Internet. Is that true?

  Second, do we have Linux versions(executable files) for some 3rd part software like AutoCad etc..; I'm okay to pay for such software but I don't want to use Windows any more?

  Or let me know do we have any applications that can run Windows executable on Linux?

  Thank you

  ReplyDelete
 7. @వీరుభొట్ల వెంకట గణేష్:
  its better if you let me know your mail ID, so that I can detail you in this regard.
  briefly answering, i too didnt like rh9 and fc, but they were part of my curriculum, my affection to ubuntu is such that you can see all systems in jntu ce pulivendula running on ubuntu!!!
  its better you use debian or ubuntu with all the dvds and cds which are pretty well available with the above link, www.zyxware.com, a company in kerala which sells cds,dvds of FOSS.
  yes we have but we prefer using the alternates like qcad in your case,
  we have a package called WINE(WINE Is Not an Emulator) that runs .exe and .msi on ubuntu.
  please send me a mail, so that we can elaborate on this. you can find my mail id in my profile.

  ReplyDelete