నమస్కారం
అందుకని నా అభ్యర్థన ఏమిటంటే, వచ్చే ఒక వారం రోజులలో
తెలుగు ప్రముఖులు-ప్రదేశాలు-సంస్కృతి ప్రతిబింబించేలా నిందా స్తుతి చెయ్యని
పాటలు / కవితలు వ్రాసి పంపగలరు. వీటిని తగు విధంగా ప్రచారం చేసే
ప్రయత్నాలు నా వంతుగా చేస్తాను.
తెలుగు భాష గొప్పదనమేమిటో తెలిపే పాటలు మనకు
అత్యల్పం. మన స్థానిక ప్రముఖులెందరో ఉన్నా, వారి గురించి మనకు తెలీదు. (ఉదాహరణకి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి కడప వారికీ, పట్టాభి సీతారామయ్య గురించి కృష్ణా జిల్లా వారికీ తరం చాలా మందికి తెలీదు)
ప్రాంతీయ ఆట-పాటలు, పండుగలు-పిండి వంటల గురించి తెలిపే తెలుగు పాటలు చాలా
అరుదు.
సురవరం ప్రతాప రెడ్డి ఎవరు అంటే చెప్పలేని దుఃస్థితి. బాపిరాజు బొమ్మలు ఎరుగని బ్రతుకులు.
ఇదంతా
ఎందు వలన? సాహిత్యం ద్వారా ప్రచారం లేకపోవటం వలన ఒక కారణం. పుస్తకాలలో విరివిగా
మనకు ఈ జ్ఞానం లభించినా సినిమా పాటల ద్వారా లేదా మంచి రాగంలో ఉన్న పాటల
ద్వారానే మనం ఈ విషయాలను జనాల్లోకి సమూలంగా తీసుకువెళ్ళవచ్చు,
పంపవలసిన మెయిల్ చిరునామా : nani1only@gmail.com
ధన్యవాదాలతో
రహ్మానుద్దీన్ షేక్
బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
ReplyDeleteTelugu Cinema News