Thursday, September 18, 2014

நீ தானே எந்தன் பொன்வசந்தம்...

நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்

நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்

ஆஹா...நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
என் வாசல் ஹே வரவேற்கும் அன்னேரம்
உன் சொர்க்கம் ஹே அரங்கேரும் கண்ணோரம்

நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
---
பாதை முழுதும் கோடி மலர்கள்
பாடி வருமே தேவக் குயில்கள்
உன் ஆசை ஹே மிதக்கின்ற பாலாடை
உன் காலை ஹே குளிப்பாட்டும் நீரோடை
வெயில் நாளும் சுடுமென தேகம் கெடுமென ஜன்னல்
திரையிடும் மேகம்
இரு காதல் விழிகளில் பேசும் மொழிகளில் பிறையும்
பௌர்னமி ஆகும்
சந்தோஷம் உன்னோடு கைவீசும் என்னாலும்
---
நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
என் வாசல் ஹே வரவேற்கும் அன்னேரம்
உன் சொர்க்கம் ஹே அரங்கேரும் கண்ணோரம்
---
ஈர இரவில் நூறு கனவு
பேதை விழியில் கோடி நினைவு
பன்னீரில் ஹே இளந்தேகம் நீராடும்
பனிப்பூக்கள் ஹே உனைக்கண்டு தேனூரும்
நீ ஆடை அணிகலன் சூடும் அறையில் ரோஜா மல்லிகை
வாசம்
முக வேர்வைத் துளியது போகும் வரையினில் தென்றல்
கவரிகள் வீசும்
நெஞ்சோரம் தவழும் முத்தாரம் என்னாளும்
---
நீ தானே எந்தன் பொன்வசந்தம்
புது ராஜ வாழ்க்கை நாளை என் சொந்தம்
என் வாசல் ஹே வரவேற்கும் அன்னேரம்
உன் சொர்க்கம் ஹே அரங்கேரும் கண்ணோரம்



Friday, September 5, 2014

సరదా కోసం, ఒక పొట్టి కథ అనువాదం

ఈ మధ్య ఎవరి వద్దకు కలవడానికి వెళ్ళినే మీరేమయినా రచనలు చేసారా అన ప్రశ్న ఎదురవుతుంది.
ఎప్పటి నుండో (నాకు ఊహ తెలిసినప్పటి నుండి) నా సొంత కథ వ్రాయాలన్నది కోరిక.
సరే అందుకు ఇప్పుడు శ్రీకారం.

కోరా లో దొరికిన ఒక ఆంగ్ల కథకు అనువాదం

౩౭ యేళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం గడిపేసరికి గురునాధానికి భార్య ఆండాళ్ళు మీద మనసు సన్నగిల్లింది. కొత్తగా చేరిన సెక్రెటరీ తాయారమ్మ మీద కన్ను పడింది. తాయారమ్మ గడుసుదాయే, ఇంట్లో నుండి ఆండాళ్ళుని తరిమేస్తేనే కాపరానికి వస్తానంది. లంకంత ఇల్లు - కోట్ల విలువ కలిగింది. ఆండాళ్ళు ఏం చేస్తుంది, పాపం - కోర్టుకు వెళ్ళింది. గురునాధం ఘటికుడు, గట్టి లాయర్లను పెట్టి పది లక్షల జరిమానాకు విడాకులకు ఒప్పించాడు.

ఆండాళ్ళుకి మూడు రోజుల వ్యవధి ఇచ్చాడు. ఆమె మొదటి రోజంతా సొత్తు మూటకట్టుకోటంలో గడిపేసింది, రెండో రోజు పనిమనుషులను పెటించి ఆ సామానంతా పుట్టింటికి మార్పించింది.
మూడో రోజు పెద్ద విందు ఏర్పాటు చేయించింది. విందు కోసం మాంఛి ఱొయ్యలు, పీతలు, చేపలు వండించింది. ముందు రోజు సహాయం చేసిన పనిమనుషులందరికీ విందు ఘనంగా చేయించింది. గురునాథానికీ, తాయారమ్మకీ టైం లేక విందుకు రాలేదని చెప్పించి, డీవీ మేనర్ కు వెళ్ళి సుష్టుగా భోంచేసి ఐనాక్స్ కి సినిమా చూట్టానికి వెళ్ళారు. పని మనుషులంతా భుక్తాయాసంతో సేదదీరారు.
ఇక ఆండాళ్ళు ఏడుస్తూ దిగాలుగా అన్ని గదులూ పరికిస్తూ, ప్రతీ వస్తువునూ పలకరిస్తూ వీడుకోలు చెబుతూ ఉంది. గురునాధానికి పూల సజ్జలంటే మహా ఇష్టం, పూల సజ్జల కోసం ఏనుగు దంతంతో చేసిన గిన్నెలను చేయించి అన్ని గదుల్లోనూ అమర్చాడు. వాడికి ఆ గిన్నెలంటే ఎంతిష్టమంటే ఆండాళ్ళుని ఒక్క గిన్నె కూడా ముట్టుకోవద్దని హెచ్చరించేవాడు.
ఆండాళ్ళు తనతో పాటు ఒక సంచిలో శుభ్రం చేసాక వచ్చిన చేప తోలుకుండే గుండ్రటి పొట్టు, రొయ్య తలలు, పీతల వ్యర్థం వేసుకుని తెచ్చింది. ఒక్కో ఏనుగు దంతం గిన్నెలో గుప్పెడు పొట్టు వేసుకుంటూ అన్ని గదుల్లో తిరగాడింది.
గురునాధం వచ్చే సమయానికి ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
తాయారమ్మకి ఆ ఇంట్లో భూతల స్వర్గం కనిపించింది. ఇద్దరూ సంతోషంగా కలకాలం ఉందామని తీర్మానించుకొని నిద్రపోయారు.
రెండో రోజు ఉదయం నుండి ఇంట్లో ఏదో తెలీని దుర్వాసన. గదులన్నీ శుభ్రం చేయించారు, ఎలుకలు ఎక్కడయినా చచ్చి పడున్నాయేమో వెతికించారు, సెంటు బాటిళ్ళు పదుల్లో కొని ఇల్లంతా చిలకరించారు. రెండు రోజులు ఇంటి బయట ఉంటూ పనిమనుషులతో ఇల్లంతా తోమించారు. ఏ ఒక్క చిట్కా పని చెయ్యట్లేదు.
జనాలు ఇంటికి రావటం మానేసారు. పని మనుషులు పని మానేసారు. ఇక లాభం లేదని ఇల్లు ఖాళీ చేసేద్దామని నిశ్చయించుకున్న గురునాధం ఇల్లును అమ్మకానికి పెట్టాడు. నెల తరువాత సగం ధర పెట్టినా ఎవ్వరూ కొనడానికి రావటం లేదు. మధ్యవర్తులు కూడా కంపు ఇల్లు అని తెలుసుకుని పలకరించడం మానేసారు. గురునాధం ఆఖరికి అప్పు చేసి కొత్త ఇల్లొకటి కొనుక్కున్నాడు.
అప్పుడే ఆండాళ్ళు ఫోన్ చేసి కుశల ప్రశ్నల అడిగింది, గురునాధం జరిగిందంతా చెప్పాడు. ఆమె అంతా నెమ్మదిగా విని, తనకి ఆ ఇల్లు అంటే ఇష్టమనీ, విడాకుల జరిమానా కింద తీసుకుంటాననీ చెప్పింది.
ఆమెకి ఈ ఇల్లు ఎంత దుర్వాసనేస్తోందో తెలీదనుకొన్న గురునాధం వెంటనే ఒప్పేసుకున్నాడు, కానీ అదే రోజున ఒప్పందపత్రాలపై సంతకాలు కావాలన్నాడు. ఆండాళ్ళు సంతోషంగా ఒప్పుకుంది. సంతకాలయిపోయాయి.
ఒక వారం తరువాత తాయారు ముఖంలో సంతోషం, ఇల్లు ఖాళీ చేసేస్తున్నందుకు. కానీ ఇంట్లో సామానుతో పాటూ ఏనుగు దంతం గిన్నెల పూల సజ్జలు కూడా బండ్లెక్కేసాయి!

Saturday, August 16, 2014

నేడే ఫైర్ఫాక్సుకు మారండి, లేదా భవిష్యత్తులో మీరు మిమ్మల్నే కోల్పోగలరు.

1990వ దశకంలో మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆగడాలను చవి చూసాము. సాఫ్టువేరు రంగంలో అధిపత్య దాహంతో చిన్న కంపెనీలను ముందు కొంత లాభం చూపించి హస్తగతం చేసుకోటం, ఆపై సదరు కంపెనీ నుండి తీసుకున్న అమూల్యమైన సాఫ్టువేరు ఉత్పత్తిని నిరుపయోగం చేయడం.
ఇక 2000 మొదట్లో ఒక ప్రత్యామ్నాయంగా గూగుల్ వచ్చినప్పటికీ, అది కూడా మైక్రోసాఫ్ట్ బాటనే పట్టింది. అయితే మైక్రోసాఫ్ట్ సందర్భంలో ప్రత్యామ్నాయాలు తక్కువ, వాఅటి గురించి జనాలకు తెలిసే అవకాశాలూ తక్కువే. అందువలన మైక్రోసాఫ్ట్ పెద్ద మేధస్సును ఉపయోగించకుండానే నిలదొక్కుకోగలిగింది.
మైక్రోసాఫ్ట్ వాడి ఉత్పాదనలు, సాఫ్టువేర్లు, మనల్ని వాడి మీద ఆధారపడేలా చేస్తాయి. ఉదాహరణకి వైరస్ వచ్చే అవకాశం మైక్ర్రోసాఫ్ట్ సరుకులో చాలా ఎక్కువ. ఇన్నేళ్ళ అనుభవంలో ఏ ఇతర కంపెనీ అయినా ఆ వైరస్ ల బారిన పడకుండా తమ సరుకును మెఱుగు పరుస్తాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆ పని చెయ్యలేదు, సరి కదా, యాంటి వైరస్ కంపెనీల మార్కెట్ ను సృష్టించింది. ఫలానా వైరస్ ఉంది అని ఫిర్యాదు వస్తే ఫలానా యాంటి వైరస్ కొనుక్కో అని సమాధానం ఇచ్చేది. ఏ యాంటి వైరస్ సాఫ్టువేరూ వేసుకోకపోతే ప్రమాదం అని హెచ్చరించి, వాడికి లాభం చేకూర్చే యాంటివైరస్ కంపెనీలను సూచించేది.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, లోతుగా వెళితే ఇంకెన్నెన్నో.
గ్నూ/లినక్స్ విప్లవం వచ్చి స్వేచ్ఛా సాఫ్టువేర్ల వాడకం పెరిగినా ఇంకా ఎందరో మైక్రోసాఫ్ట్ ఉచ్చులో బంధీలుగానే ఉన్నారు.
ఇక యాపిల్ అయితే మరీ ఘోరం, మనకి నచ్చిన హార్డువేరు కొనుక్కునే సదుపాయం కూడా ఉండదే! ఏదయినా సాఫ్టువేరు ఉపకరణం ఆడించాలన్నా కాసులు విదల్చాల్సిందే!
గూగుల్ వాడు వీళ్ళకన్నా మేలేమో అనుకుంటే అదీ కాదాయె!
గూగుల్ వాడు చాలా తెలివయిన జిత్తునక్క వేషాలు కలవాడు.
మనకు తెలీకుండానే మన మెయిల్స్, ప్లస్ పోస్టులు, బ్లాగు పోస్టులు, చాట్ మెసేజులు, అన్నీ, ఇది పబ్లిక్, ఇది ప్రయివేట్ అనే వ్యత్యాసం లేకుండా అన్నిటినీ దాచుకుంటున్నాడు. వాటిని పలు విధాలుగా వాడుకుంటున్నాడు. మన బాహ్య-వెలుపల-గుప్త జీవితాల చిట్టా గూగుల్ వాడి చేతుల్లో ఉంది. ప్రభుత్వాలడిగితే ప్రభుత్వాలకి, డబ్బులు విసిరే బడా కంపెనీలకీ ఈ సమాచారం ఎటువంటి కరుణా లేకుండా నిర్దాక్షిణ్యంగా పంచిపెడుతున్నాడు. అది పొందిన గవర్నమెంటులు తమకు ముప్పు ఉన్న మనుషులను పట్టుకుని శిక్షిస్తున్నారు, ఇంటలిజెన్స్ రిపోర్టులు రూపొందిస్తున్నారు సరే! కానీ అదే సమయంలో ఎందరో వ్యక్తులను వ్యక్తిగత విషయాల గూర్చి హింసించి, శిక్షిస్తున్నారు - ఇది గమనార్హం. ఇక బడా కంపెనీల సంగతి సరేసరి. మనకు తెలీకుండానే మన మెయిల్స్ లో మెయిల్లోని పాఠ్యానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన దర్శనమిస్తుంది. మన మెయిల్లోని సమాచారం (అది గూగుల్ వాడు చదువుతాడా లేదా అన్నది తరువాతి విషయం) చూసి, తగ్గ ఆడ్స్ వేసే ప్రోగ్రాములు గూగుల్ వాడి దగ్గర కోకొల్లలు.
ప్రస్తుతానికి చాలా మంది గూగుల్ వాడి ప్రోడక్ట్స్ అన్నీ వాడడం లేదు కాబట్టీ చాలా సమాచారం గూగుల్ వాడికి అందడం లేదు. అందుకనే పొద్దస్తమానమూ గూగుల్ క్రోం వాడు, యూట్యూబ్ వాడు, జీమెయిల్ వాడు అని వాడి సొద.
ఒకవేళ గూగ్ల్ క్రోం వాడి జీమెయిల్ ఉపయోగిస్తే, గూగుల్ వాడికి మన మెయిల్స్ లోని సమాచారం గోప్యంగా మరింత త్వరిత గతిన చేరే అవకాశాలు ఉంటాయి.
గూగుల్ నేడు ఆండ్రాయిడ్ ను పోషిస్తోంది - ముబైల్ రంగంలో అద్దే అగ్రగామి.
క్రోం - మనకు తెలీకుండానే ఎందరమో దీనినే అప్రమేయ విహారిణిగా వాడుతున్నాము.
జాలశోధన, యూట్యూబ్,మెయిల్స్, డాక్స్ (డ్రైవ్) - ఇవీ మనమంతా వాడేస్తున్నాం, ఆయా విషయాలలో అవే అగ్రగామిలూను.
అందాకా బాగుంది. ఇవి అత్యంత ప్రజాదరణ పొందాక ఏమవుతుంది?
ఏమవుతుందీ, గూగుల్ సరుకు తప్ప ఇతరత్రా మన కళ్ళకు కనిపించవు.
మైక్రోసాఫ్ట్ మార్కెట్ లో ఉన్నపుడు ఎందరో కొందరికి రెడ్ హ్యాట్, ఫెడోరా, డీబియన్, ఉబుంటూ, యాపిల్, సొలారిస్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలుసు. పని వద్దో కాలేజీలోనో వాడే వారు కూడా.
కానీ ఆండ్రాయిడ్ కు ప్రత్యామ్నాయం సయనోజెన్ మాడ్, ఫైర్ఫాక్స్ఓఎస్ మొ॥ ఉన్నవని ఈనాడు చాలా మందికి తెలీదు.
క్రోం స్థానే ఫైర్ఫాక్సును వాడటానికి జనాలు సుముఖత చూపలేకపోతున్నారు. క్రోం కన్నా ఫైర్ఫాక్స్ వేగవంతం, పైగా అంతర్జాల వాడుక లేనప్పుడు ఫైర్ఫాక్స్ జాలంతో సంపర్కం చెయ్యదు.  ఈ విషయం కనిపెట్టాలంటే ఒక నెల పొర్తిగా క్రోం ని, ఒక నెల పూర్తిగా ఫైర్ఫాక్సునే వాడి ఇంటర్నెట్ వాడకంలో తేడాలు గమనించండి. కేవలం జీమెయిల్, గూగుల్ సెర్చ్ మొ॥ గూగుల్ సరుకు కొంత వేగవంతంగా క్రోం లో ఆడినట్టు మనకు భ్రమ కలుగుతుంది. నిజానికి అలా జరుగదు.
ఇక జాలశోధన సమయంలో మన వ్యక్తిత్వానికి మన శోధనలను ముడిపెట్టే  గూగుల్ శోధన చాలా అసహ్యమయిన చర్యలను మన శోధనాధారంగా చేస్తోంది - అవి మనకు తెలీవు.
డక్‍డక్‍గో లాంటి శోధనయంత్రాలు మన శోధన ను పసిగట్టవు, మనకు ఇబ్బందులూ చేపట్టవు.
యూట్యూబ్ వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని ఈ మధ్యనే చూసాము కూడా. కొన్ని కంపెనీలు పైరసీ విరుద్ధ చట్టాలు రూపొందించి త్యాగయ్య కృతులనే కాపీరైటులో చూపిన వైనం ఈ అంధ్య పెద్ద దుమారమే రేపింది.
డాక్స్, లేదా డ్రైవ్ కి ప్రత్యామ్నాయంగా ఎన్నో సేవలు జాలంలో కలవు, జోహో అనే భారతీయ కంపెనీ కూడా గూగుల్ డాక్స్ లా వర్డ్, స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషన్ ఆన్లైనులో చేసుకునే సేవలను అందిస్తుంది.
మన నుండి ఎంత తక్కువ అయితే అంత తక్కువ సమాచారం జాలంలోకి చేరేలా జాగ్రత్త తీసుకోవాలి, లేదా మీరు ఎవరూ లేని సమయంలో వ్యక్తిగతంగా ఏవో కొన్ని వీడియోలు యూట్యూబులో చూసారు, అందరి ముందు, ఏదో కాన్ఫరెన్సులో ఏదో వీడియో యూట్యూబులో చూపించాల్సి వచ్చింది, ఆ వీడియో అయిపోయిన వెంటనే సజెస్టెడ్ వీడియోస్ అంటూ అంతకు ముందు మీరు చూసిన వీడియో కు సంబంధించిన మరిన్ని నలుగురు ముందూ యూట్యూబ్ చూపెట్టింది - ఇది అసలు ఊహించగలమా?
అలానే ఏదో  వివాదాస్పద జాలస్థలి (వెబ్సైట్) ఉంది. మీరు స్నేహితుల ముందు సెర్చ్ చేసారు, ఫలానా జాలస్థలిని మీరు ఫలానా తేదీన చూసారని వస్తుంది - ఎంత ఇబ్బంది?
ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి, వినియోగదారుడికి మరింత మెఱుగైన సేవలు అనే నెపంతో ఆయా జాలస్థల సేవలు అనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చాలా వరకూ మన వద్ద నుండి రాబట్టి దుర్వినియోగం చేస్తున్నాయి. మన వ్యక్తిగతత్త్వాన్ని మనమే వారికి ఇవ్వాళ చేరవేసి రేపు బాధపడే సందర్భాలను కావాలనే ఏర్పరుచుకుంటున్నాము.
దీనికి స్వస్తీ పలకాలంటే అలాంటి శోషణకు స్థానంలేని సేవలను ఉపయోగించవచ్చు.
ఇవ్వాళ ఆఫ్లైనులో గూగుల్ డాక్స్ వాడాలంటే క్రోం లోనే సాధ్యం ఐ గూగుల్ వాడు ప్రకటించాడంటే దానర్ధం, ఆఫ్లైన్ ద్వారా క్రోం ని మన మొత్తం కంప్యూటర్ లోకి జొరబడే అవకాశాన్ని మన ద్వారానే ఇప్పించాలని చూడటం, ఇక దీని పర్యవసానం జనాల ఆలోచనలకే వదిలివేస్తున్నాను.
ఆండ్రాయిడ్ ద్వారా ఎన్నో కంపెనీలను నిబంధనలు మార్చి వాడుకరుల సమాచారం రాబట్టే ప్ప్రయత్నం గూగుల్ పెద్ద యెత్తునే చేబడుతోంది కూడా.
మరి దీనిని ఎలా ప్రతిఘటించడం?
ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా!
గూగుల్ క్రోం ను వాడడం మానేయడం! మీ స్నేహితుల ద్వారా మానిపించడం.
లేదా గ్గూగుల్ విజృంభణలో అందరూ బలి కావాల్సిందే!
ఫైర్ఫాక్సును వాడండి. గూగులు, మైక్రోసాఫ్ట్, యాపిల్ లా కాకుండా ఫైర్ఫాక్స్ కేవలం ఔత్సాహికుల ద్వారా ఏనాటికానాడు మెరుగు పరచబడుతుంది కూడా. అందరికీ జాలం అన్న నినాదంతో ముందుకు వెళుతున్న మొజిల్లా ఫైర్ఫాక్స్ మన భారతీయతను ఆదర్శంగా తీసుకుంది కూడా.
వేరే ఏ బడా కంపెనీలు మనల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నా, మొజిల్లా మాత్రం అందుకు చాలా దూరం :)

Tuesday, July 29, 2014

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవితలు, పాటలకు ఆహ్వానం

నమస్కారం

తెలుగు భాష గొప్పదనమేమిటో తెలిపే పాటలు మనకు అత్యల్పం. మన స్థానిక ప్రముఖులెందరో ఉన్నా, వారి గురించి మనకు తెలీదు. (ఉదాహరణకి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి కడప వారికీ, పట్టాభి సీతారామయ్య గురించి కృష్ణా జిల్లా వారికీ  తరం చాలా మందికి తెలీదు) ప్రాంతీయ ఆట-పాటలు, పండుగలు-పిండి వంటల గురించి తెలిపే తెలుగు పాటలు చాలా అరుదు. 
సురవరం ప్రతాప రెడ్డి ఎవరు అంటే చెప్పలేని దుఃస్థితి. బాపిరాజు బొమ్మలు ఎరుగని బ్రతుకులు. 
ఇదంతా ఎందు వలన? సాహిత్యం ద్వారా ప్రచారం లేకపోవటం వలన ఒక కారణం. పుస్తకాలలో విరివిగా మనకు ఈ జ్ఞానం లభించినా సినిమా పాటల ద్వారా లేదా మంచి రాగంలో ఉన్న పాటల ద్వారానే మనం ఈ విషయాలను జనాల్లోకి సమూలంగా తీసుకువెళ్ళవచ్చు, 

అందుకని నా అభ్యర్థన ఏమిటంటే, వచ్చే ఒక వారం రోజులలో తెలుగు ప్రముఖులు-ప్రదేశాలు-సంస్కృతి ప్రతిబింబించేలా నిందా స్తుతి చెయ్యని పాటలు / కవితలు వ్రాసి పంపగలరు. వీటిని తగు విధంగా ప్రచారం చేసే ప్రయత్నాలు నా వంతుగా చేస్తాను.
పంపవలసిన మెయిల్ చిరునామా : nani1only@gmail.com
ధన్యవాదాలతో
రహ్మానుద్దీన్ షేక్