చాలా రోజులైంది బ్లాగు లో ఒక టపా రాసి. నా శిక్షణకాలం కావటం వలన నాకు సమయం అస్సలు కుదరటం లేదు.
ఇన్ని రోజులకి సమయం కూర్చుకుని ఈ బ్లాగు రాస్తున్నా!
తెలుగు వాడకాన్ని మన సంగణక యంత్రాల్లో పెంపొందింప చెయ్యటం అనేది ఇప్పుడు నా ముఖ్య లక్ష్యం
అందుకు లినక్స్ వాడకం ఒక మంచి దారి. మరి చాలా మంది లినక్స్ వాడాలంటే భయపడతారు.
ఇందుకు నేను మన ఈ-తెలుగు వారు నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన స్టాల్ లో ఒక చిన్న ప్రదర్శన మరియు అంకోపరిని తెచ్చుకునే వారికి లినక్స్ స్థాపన వంటివి ఒక రోజు నాకు ఖాళీ ఉన్న రోజు చెయ్యాలనుకుంటున్నా.
ఇది నేను ఇంకా ఈ-తెలుగు వారితో సంప్రదించి ఏ రొజు జరుగుతుందో తరువాత చెపుతాను.
అయితే సంగణక యంత్ర వాడుకర్లు లినక్స్ ను ఎందుకు వాడరో.
లేక లినక్స్ వాడకంలో వారికి ఏమి ఇబ్బంది గలదో వారు నా బ్లాగాభిముఖంగా తెలిపితే
ఆయా అంశాలను నా ప్రదర్శన లో చేర్చి వాటిపై అవగాహన కలిపిస్తాను
వృత్తిరీత్యా నిబద్ధులు ఏమీ చెయ్యలేరు వారు వారి కంపెనీ చెప్పిన నిర్వహణ వ్యవస్థనే వాడాలి
అలా కాకుండా మిగతా వారు మీ మీ అభిప్రాయాలను మీ వ్యాఖ్యలుగా ఇక్కడ పెట్టండి
అలానే ఎన్నో లినక్స్ మరియు ఇతర స్వేచ్ఛామృదోపకరణాల యొక్క డాక్యుమెంటేషన్ తెలుగులోకి అనువాదం కావలసి ఉంది అందువలన ఇటువంటి వాటికి ఎన్తమంది ఉత్సాహంగా ఉన్నారో తెలుపగలరు
॥ సత్కృతాయాస్తు మంగళం ॥
Saturday, December 4, 2010
Saturday, October 23, 2010
ఉబుంటు పంపకంలో తెలుగు ఖతులను స్థాపించే విధానం
ఉబుంటు పంపకంలో by default, పోతన మరియు వేమన ఖతులు ముందుగానే స్థాపితమై ఉంటాయి. అవి కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు.
ఒకవేళ మీరు కొత్త ఖతులు స్థాపన చేయదలచుకుంటే, అదెంతో సుళువు.
ముందుగా ఆయా ఖతులను డౌన్లోడ్ చేసుకుని ఆ టీటీఎఫ్ దస్త్రాలను su గా
/usr/share/fonts అనే ఫోల్డర్ లోకి కాపీ చేస్కోండి ఆ పై ఈ కమాండ్ ను రన్ చెయ్యండి
fc-cache -fv
ఇది రన్ చేసాక మీ యంత్రంలోకి ఆయా ఖతులు స్థాపితమవుతాయి
లేదా పై కమాండ్ ను రన్ చెయ్యకుండానే సిస్టంను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది
Tuesday, October 5, 2010
కొత్తవారికి లినక్స్ పంపకం
ఇదివరకే లినక్స్ పంపకాల గురించి ఇక్కడ చర్చ జరిగింది చూడగలరు.
అయితే విండోస్ కంటే ఎన్నో రెట్లు మేలయినదని అనుకుంటున్నాం కదా లినక్స్ ను
అందుకని లినక్స్ కు మారదామా అంటే ఒక పెద్ద చిక్కుప్రశ్న ఏపంపకం వాడాలి అని
పక్కింటి శ్రీను డెబియన్ ది బెస్ట్ అంటాడు ఎదురింటి రాజు ఫెడోరా బెటర్ దాన్ ది బెస్ట్ అంటాడు ,
ఇక మన హేచోడీ లేదా ప్రొఫెసర్ ఆయన వాడిన రెడ్ హ్యాట్ మాత్రమే ఒక అసలైన పంపకమనీ
మిగతావి వేస్ట్ అని కొట్టిపారేస్తాడు.
అయితే లినక్స్ వాడే వారికి అన్నిరకాల వేసులుబాట్లూ ఉంటాయి.
ఇన్ని చాయిస్లు ఉన్నయ్యంటే అది ఎంత బెస్ట్ అన్నది మీరే చెప్పగలరు
ఆ మధ్య ఒక టపాలో ఎవరో ఫ్రీ సాఫ్ట్వేర్ అంటున్నారు జీవితం లో అన్ని ఫ్రీగా రావు కదా అని
ఆయనకు ఈ టపా ఎలాగోలా చేరాలి ఆయన దీన్ని చదవాలి
ఆంగ్లం చాలా చిన్ని భాష, వారి దేశం ఎంత చిన్నదో బ్రిటీష్ వారి భాష కూడా అంటే చిన్నది
వారికి ఎక్కువ పదాలు లేవు
మనం స్వాతంత్ర్యం అన్నా, స్వేచ్ఛ అన్నా, ఉచితం అన్నా
ఈ మూడింటికీ వారి దగ్గర ఒక ఫ్రీ అన్న పదమే ఉంది
(ఇంకా చెప్పాలంటే మాకు ఒక ౬ పేజీల పాఠం హిందీ ౮వ తరగతిలో ఉంది అందులో కూడా ఇండెపెండెన్స్ డే అంటే అపరతంత్ర దినోత్సవం అన్న అర్థం వస్తుంది కానీ మనం స్వాతంత్ర్యదినోత్సవం అంటాం అంటూ ఆరు పేజీల సుత్తి)
చెప్పొచ్చేదేమిటంటే ఫ్రీ అంటే అర్థం ఉచితం కాదు తండ్రీ, ఫ్రీ అంటే స్వేచ్ఛ
అయితే నా స్వంత పూచీ మీద మీరు ఉబుంటు ని కళ్ళు మూస్కుని సారీ కళ్ళు తెరిసే అనుసంధానం చేసేస్కోండి
ఒక వేల మీరు పూణే వాసులైతే నేనే మీ వద్దకొచ్చి ఉచిత(ఫ్రీ)ముగా చేసి పెడతాను
ఉబుంటు డెబియన్ ఆధారిత పంపకం
మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే
ప్రతీ పంపకానికి కొన్ని ప్యాకేజేస్ ఉంటాయి
అవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి
వాడుకరులు ఎంతమంది ఉన్నారు వీరిలో ఎంతమంది అంతర్జాలంలో సహాయం చేస్తున్నారు
మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు ఆ పంపకంలో ఉన్నాయా
ఇవన్నీ ముందు తెలుసుకోండి
ఇక పొతే నా సలహా ఏమిటంటే ఒక వేల మీ వద్ద అంతర్జాలం అనుసంధానించి ఉంటే ఉబుంటు మేలు
లేదా డెబియన్ బావుంటుంది.
ఉబుంటూ లో మీరు కావాల్సిన అన్ని ప్యాకేజ్లను డౌన్లోడ్ చేస్కొని మీ డెస్క్టాప్ తో ఎన్నో చెయ్యవచ్చు
తెలుగు స్థానికీకరణ కూడా ఉబుంటు లో బాగుంటుంది
నేను ప్రస్తుతం 9.10 వాడుతున్నాను
ప్రతి ఏడు ఏప్రిల్ మరియూ అక్టోబర్లలో కొత్త వెర్షన్ వస్తుంది
ప్రస్తుతం 10.04 చలామణి లో ఉంది
ఇవాలో రేపో 10.10 రాబోతోంది
అయితే చాలా మంది 10.04 లో కొన్ని అవగుణాలున్నాయని చెప్పారు
సో 9.10 లో నాకేమి గ్లిచెస్ కనపడలేదు
మీరూ అదే వాడండీ !!!!

Monday, October 4, 2010
మధురానుభూతి (ఎవరో కనుక్కోండి చూద్దాం!!)
నిజంగా ఇవాళ నా జీవిత్ంలో మరిచిపోలేని రోజు
ఒక నిష్కల్మషమైన మనిషిని కాదు కాదు దంపతుని ఇవాళ నేను కలవటం జరిగింది.
దాదాపు ఆరేళ్ళుగా బ్లాగులోకం నాకు పరిచయం, అయితే నేను ముఖాముఖీ కలిసింది ఒక వీవెన్ గారినే
అయితే ఇన్నేళ్ళకు ఒక బ్లాగ్దంపతిని కలిసాను, అదీ పుణె లో!!!!
కలవటం ఒకెత్తైతే వారి అనురాగం, ఆప్యాయతలు మరో ఎత్తు.
మన బ్లాగర్లు ఎంత సన్నిహితంగా ఉంటారో, దానికిదొక తార్కాణం.
అసలు కొన్ని సంవత్సరాల పరిచయమా లేక మరీ దగ్గర బంధువులా అన్న స్థాయిలో వారితో మాటలాడాను నేను.
పుణే వచ్చినప్పట్నుండి వీరిని కలుద్దాం అనుకున్నా, అడగక ముందే ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.
పైగా మా గురువు గారు, ఆచార్య రాకేశ్వర గారు కూడా వీరిని కలువమన్నారు, నాకేమో కొంచెం సిగ్గాయె, ఎలా గొలా ధైర్యం చేసి, బయలుదేరాను. ముందే ఫోన్ చేసి చిరునామా,దారి కనుక్కున్నాను.
అక్కడ వెళుతుండగా, వారు ఎలా ఉంటారో, ఎలా నన్ను స్వీకరిస్తారో అన్న భయం, బిడియం.ఎట్టకేలకు వారింటికి చేరాను. తెలుగు బ్లాగర్ల జాబితాలోకి చేరాక మొట్టమొదటి ముఖాముఖీ కలయిక వీరితోనే!!! రాకేశ్వర గారితో కలిసే అవకాశం వచ్చినా కానీ వర్షం ఒకరోజు, నా పనులతో ఒక రోజు, కలవలేక పోయాను.
ఆ విధంగా వీరిని కలిసానన్నమాట.
వెళ్ళగానే కరచాలనం తో పరిచయం, ఆ పై వారి పూర్తి కుటుంబం తో నాకు పరిచయం
వారు నాకప్పుడే ప్రముఖ బ్లాగరు అనే బిరుదు కూడా ఇచ్చేసారు( నాకున్న పాతిక పోస్టులకే???)
సరే ఆ పై మాటా మంతీ, దాదాపు ఒక ౨(రెండు) గంటల పాటూ మాటలు సాగాయి.
మన తెలుగు సంస్కృతి నుండి మొదలు, తెలుగు వాళ్ళ భావాలు, భావనలు, తీరు-తెన్ను, అన్నీ మాట్లాడేసాం. ఆ పై వారు నేను పుణె పై కొత్తలో రాసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, పుణె యొక్క గుణ-గణాలను తెలిపారు.
అప్పుడనిపించింది, నిజంగానే నేను కొన్ని విషయాల్లో మరీ సూక్ష్మంగా పరిశీలిస్తూ పుణె లోని మంచి గుణాలను దాటవేసానేమో అని.
సరే ఆ తర్వాత అతిథి సపర్యలు చేసారు.
వారి కొడుకూ, కోడలూ, మనుమడు, మనుమరాలు చూడచక్కనైన కుటుంబం వారిది.
మొత్తానికి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కానీ వారితో అలా మాటలాడుతూనే ఉందిపోవాలనిపించింది.
నేను వెళుతున్నప్పుడు ఆయన నాతో తోడు వస్తానంటే అప్రయత్నంగానే సరే అనేసాను.
ఆయనతో మాటలాడేందుకు మరి కొంత సమయం దొరుకుతుంది కదా అని!
అలా మేము నడుస్తూ, మాటలాడుతూ ఉన్నాము, నా గురించి, వారి స్నేహితుల గురించీ, చర్చిస్తూ, రాజకీయాల దాకా విషయాలను తీస్కెళ్ళాం. వర్షం మొదలయి జోరుగా కురుస్తోంది, బస్ స్టాప్ ఇంకా చాలా దూరంగా ఉంది, ఆయన్ని చూస్తే నేమో వయసులో చాలా పెద్దవారు, ఆ వర్షంలో ఎలా నడిచారో నాతో పాటు!!!
అక్కడ్నుండీ బస్ స్టాప్ చేరేసరికీ, వర్షం మరీ ఉద్ధృతమయింది, ఇక వారినీ కష్ట పెట్టడం ఇష్టం లేక మాటా-మంతీ పూర్తి చేసి బస్ ఎక్కాను, ఈ వర్షంలో ఆయన ఇంటికి ఎలా చేరారో ఏమో.
నాకు ఇంత బాగా కబుర్లు చెప్పే వారు ఇప్ప్టివరకూ ఎవరూ దొరకలేదు
మాటలాడితే బూతులొస్తాయి కొందరికి
మాటలాడితె ఎదుటివాడ్నో, లేక మరొకరినో వీపు చాటున నిందిస్తాడు మరొకడు.
కానీ ఇలా నిష్కల్మషంగా మాటలాడే వారు చాలా అరుదుగా దొరుకుతారు, అదీ దేశం కాని దేశంలో అయితే అది ఎంత అదృష్టం!!!
మరో రెండు రోజుల్లో కలవడానికి అపాయింట్మెంట్ తీస్కొని మరీ ఆయన్ను వదల్లేదు నేను!!
సరే ఇంతకీ ఆయనెవరో చెప్పలేదు కదూ
సస్పెన్స్
మీరె కనుక్కోండి!!!

Wednesday, September 29, 2010
సంగీత ప్రియులకోసం......
ఈ టపా చదివిన పిదప ఒక మారు ఈ వెబ్సైటును చూడండి , మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళతారు
మన దక్షిణ భారతాన్ని మొత్తాన్ని ఒక తాటిపై నిలిపింది సంగీతమనే చెప్పాలి.
మనం అధ్యయనం చేసెడి సంగీతం - దీనినే కొందరు దక్షిణ భారత సంగీతం అని, మరికొందరు కర్ణాటక సంగీతమని అంటారు.
కన్నడ రాజుల ద్వారా పోషించబడింది కాబట్టీ ఆ పేరు వచ్చి ఉండవచ్చు అని నేననుకుంటున్నాను, నేనైతే ఎప్పటికీ కర్ణాటక సంగీతం అని మాత్రం పలుకాలంటే ఒక రకంగా ఉప్పుపలుకులు నములుతాను(ఆ భావన వల్లనే). శాస్త్రీయ సంగీతమనో, మరీ అనవలసి వస్తే కార్నాటిక్ (carnatic not karanatik) అని దాటవేస్తాను.
ఇందులో ఉన్న ప్రత్యేకలేమిటంటే, ఈ శాస్త్రమునకు ప్రధాన వాగ్గేయకారులంతా మన తెలుగువారే, పాడేవారు(ఒకప్పుడు రాజుల కొలువుల్లో-ఇప్పుడు కాదు) కూడా మనవారే ఉండేవారేమో కానీ ఈ మధ్య పాశ్చాత్యుల ప్రభావంతో మొదట పాప్, ఆ పై హిప్-హాప్, ఇప్పుడు రాక్, మెటల్ ఇంకెక్కడికో ఈ పయనం????
అయితే మన దక్షిణ భారత సంగీతకళ చాలా ప్రాచీనమైనది, ప్రపంచంలోనే!!!
ఇది చాలా జటిలమైనందువల్ల సాంకేతికంగా,కళాపరంగా కూడా చాలా నేర్పరితనం కావాలి. మన ఈ కళకు మూలం రాగం, మరియు తాళం.
రాగం అనేది స్వరముల గంభీరత్వాన్ని కొలుస్తే, తాళం అనునది వాటి రూపాంతరములను కొలుస్తుంది.
మనకి ఏడు తాళాలు మరియు డెబ్బదిరెండు మూలమైన రాగములు కలవు.
మిగితా రాగాలన్నీ వీటిపై ఆధారపడి ఉంటాయి లేదా వీటి నుండి ఉద్భవించబడ్డాయి. ఈ ౭౨ రాగాలను మేళకర్తరాగములంటారు.
౧౯ వ శతాబ్దానికి చెందిన త్యాగబ్రహ్మ(త్యాగరాజులవారు), ముత్తుస్వామి దీక్షితులవారు మరియు శ్యామశాస్త్రి గారు, కొన్ని వేల కృతులను అందించిన మహా వాగ్గేయకారులు.
మన ఈ సంగీత శాస్త్రం ముఖ్యంగా భక్తిరసప్రధానముగా ఉంది.
మనం సరిగమలు అని వాడుక భాషలో చెప్పే స్వరాలే ఈ సంగీతశాస్త్రానికి పునాది.
అన్ని రాగములు ఈ సప్తస్వరముల నుండే ఉద్భవించాయి.
ఈ సరిగమలకు గల పూర్తి నామాలు.
అలాగే మధ్యమమునకు కూడా రెండే విధములు కలవు.
ఒక పక్క సౌందర్యమును మరో పక్క భక్తిని చక్కగా మేళవిస్తే తయరైన కృతులు అత్యంత మధురంగా ఉంటాయి.
భగవంతుని సాక్షాత్కారమే ధ్యేయంగా రచింపబడిన ఈ సంగీతం ఎంతో సుందరంగా ఉంటుంది.
భగవంతుడికి, భక్తికి, భక్తునకు, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. శివుడ్ని నాదం యొక్క ప్రతిరూపంగా
కొలుస్తాము. ఎందరో దేవతల వద్ద సంగీత వాద్యాలు ఉండటం కూడా గమనించాము.
కృష్ణుడు కూడా వేదానాం సామవేదోస్మి అన్నాడు కదా! (సామవేదం సంగీత-శృతి-గాన ముఖ్యం)
పార్వతి లాస్యానికి ప్రతిరూపం. ఎల్లప్పుడూ జ్ఞానదేవత అయిన సరస్వతిని వీణాధారిణిగానే చూస్తాం. అసలు వీణలేనిదే ఆమెను సరస్వతి అని కూడా పోల్చుకోలేము. వీణను విపంచి అని కూడా అంటారండోయ్.
లక్ష్మీ దేవి సంగీతప్రియ. శ్రీమహావిష్ణువు ఎక్కడ పడితే అక్కడ డోలు వాయించేస్తాడు.
నంది లయకు అధిష్టాన దైవం. ఇహ నారద-తుంబురులు సంగీతలోకంలో ప్రఖ్యాతులు. వారిని వైనిక-గాయకులుగా మనం గుర్తించాలి.
మొన్నామధ్య ఎస్వీ గారి సినిమాలో కూడా ఘటోత్కచుడ్ని వీణాపాణిగా చూపారు.
ఇక గంధర్వులు, కిన్నరులు, కింపురుషులైతే ఈ విద్యకు పెట్టింది పేరు.
మన ధర్మశాస్త్రాల్లో ఈ విద్యను గంధర్వవిద్యగా చెప్పారు.
మారుతి అయిన ఆంజనేయ స్వామి హనుమద్వీణ వాయించడంలో దిట్ట. ఈనాటి చిత్ర వీణ ఈ హనుమద్వీణకు రూపాంతరం.
ఇంతటి విశిష్టత కలిగిన మన సంగీతాన్ని మనం అర్థంకాలేదనో
నాకు వంటపట్టదనో వదిలెయ్యవచ్చా!!!
పాశ్చాత్య పోకడలకు పోయి మన అరుదైన ఈ సంపదను వదులుకోగలమా.
ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల మన దైన ఈ విద్యను అరవలు తమ కాపీరైట్లు పెట్టుకోవటం మొదలెట్టారు.
ఇది ఏమి బీసీ కాలం నాటిది కూడా కాదే
అన్నమయ్య , రామదాసుల వారికాలానిది కూడా కాదు.
నన్నడిగితే నాకు తెలిసినంత వరకూ భారతీయుడిగా మనం నేర్చే అత్యంత మోడర్న్ విద్య ఈ శాస్త్రీయ సంగీతం.
ఇందులోని మెళకువలు , ఛలక్కులు, జుగల్బందీలు, ఏ హిప్-హాప్ కు మెటల్ కు తీసిపోవు.
అనుభవించడం మొదలెట్టాక రొజుకో వింత అనుభూతి కలుగుతుంది.
అయితే ఏమిటి అంటారా....
ఇదంతా పెద్ద ఖర్చుతో పని అంటారా.
మీరు నేర్చుకోకపోయినా వినండి వినిపించండి, నక్కాబోయే భార్య "గిమ్మీ మై తాళి మై లైఫ్ ఇజ్ ఖాళీ ఖాళీ" అని
పాడేకన్న అరకొరగా ఏ త్యాగబ్రహ్మ కృతే పాడినా నేనెంతో ఆనందిస్తాను.
అలా అందరం మొండిపట్టు పట్టామంటే మన నుంచి తరలిపోతున్న వోక్స్వాగన్, డెల్, తిరిగిరాకపోయిన సంగీత ప్రియులం మనమే నన్న ట్రేడ్ మార్కు మనకు మిగిలిపోతుంది.
ఎంతో కష్టపడి రాత్రీ పగలూ ఒకటి చేసి మనకు సంపాదించారు మన త్యాగబ్రహ్మ ఈ పేరుని
దీన్ని అప్పణంగా అరవలకు వదిలివేయాలా?
ఆలోచించండి.....
ఈ వెబ్సైట్ ఖచ్చితం గా చూసి అక్కడ ఉన్న పాటలను డౌన్లోడ్ చేసి వినండి.
అదొక అలవాటు గా మార్చు కోండి.
కనీసం రోజుకొకటి వినండి. ఉచితంగా మీకు పాటలు వస్తున్నా మీరొద్దంటే మిమ్మల్ని ఎవ్వరం మార్చలేం. మన
తెలుగుజాతి ఖర్మ అని వదిలెయ్యటం తప్ప.
సంగీతప్రియుల వెబ్సైటు - sangeetha priya

- స - షడ్జమం
- రి - రిషభం
- గ - గంధర్వం
- మ - మధ్యమం
- ప - పంచమం
- ద - దైవతం
- ని - నిషాదం

Subscribe to:
Posts (Atom)